పోషణ పక్షంలో బాలింతలకు అవగాహన

తిరుమలగిరి 18 ఏప్రిల్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:
తిరుమలగిరి మండలంలోని గుండెపురి అంగన్వాడి సెంటర్లో పోషణ పక్షంలో భాగంగా సూపర్వైజర్ కైరున్నిసా మాట్లాడుతూ వెయ్యి రోజుల ప్రాముఖ్యత గురించి గర్భవతులు బాలింతలకు వివరించారు. పిల్లలకి హైపటైటిస్ టెస్ట్ చేసి తల్లులకు అవగాహన కల్పించడం జరిగింది అనంతరం అన్నప్రాసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రవళిక, అంగన్వాడీ టీచర్లు ఎమ్మెల్య ,స్వప్న ,మల్లమ్మ ,జయంతి ,భవాని అంగన్వాడి హెల్పర్ సుజాత గర్భవతులు ,బాలింతలు, పిల్లల తల్లితండ్రులు తదితరులు పాల్గొన్నారు.