పోరస్ ప్లాంట్ లో ఘనంగా అగ్ని మాపక వారోత్సవాలు
మండల పరిధిలోని నల్లబండగూడెం లో గల పోరస్ ఫ్యాక్టరీ నందు 2026 అగ్ని భద్రత వారోత్సవాలు నిర్వహించారు.
నల్లబండగూడెం, 18 ఏప్రిల్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– ఈకార్యక్రమాన్ని అగ్నిమాపక అధికారి డాక్టర్ కే బాబు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరు అగ్ని భద్రతపై అవగాహనా పెంచుకోవాలని, అలాగే ప్లాంట్ సెక్యూరిటీ బృందం అందిస్తున్న సేవలను అభినందించారు. ఫోరస్ ఫ్యాక్టరీ వారు అగ్ని నివారణ మరియు నియంత్రణ చర్యల్లో కేవలం ప్లాంట్ కు మాత్రమే కాకుండా సమీప గ్రామాల్లో కూడా ఏదైనా అగ్నిప్రమాదం సంభవించినప్పుడు వెంటనే స్పందించి అక్కడ ఎలాంటి ప్రమాదం జరగకుండా అంకితభావంతో పనిచేయాలని చెప్పారు. అనంతరం అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలో వారికి వివరంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్టరీ మేనేజ్మెంట్, కార్మికులు, ఫైర్ సిబ్బంది లీడింగ్ ఫైర్ ఫైటర్ ఎం శ్రీనివాసరావు, ఫైర్ ఫైటర్ జి శ్రీనివాసరావు, ప్రవీణ్ కుమార్, శివ, వెంకటేశ్వర్లు, రవి తదితరులు పాల్గొన్నారు.