పొలాల్లో దిగిన హెలికాప్టర్.. కూలీల ఫొటోలు

హెలికాప్టర్ మన ఇంటిపై నుంచి వెళుతుంటే పరుగులు పెట్టి మరీ చూస్తాం. అలాంటిది పొలాల్లో ల్యాండ్ అయితే? నల్గొండ జిల్లాలోని చిట్యాల(M) వనిపాకల వద్ద పొలాల్లో ఓ ఆర్మీ హెలికాప్టర్ సాంకేతిక సమస్య వల్ల అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. అక్కడే వ్యవసాయ పని చేస్తున్న మహిళా కూలీలు హెలికాప్టర్ వద్దకు చేరి ఫొటోలు తీసుకున్నారు. రోజంతా పడ్డ అలసటను ఆ కొద్ది క్షణాల్లో మర్చిపోయారు. వారు కలిసికట్టుగా ఫోటో దిగడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..