పేద ప్రజలకు ఉచిత సేవలు అందించి మన్ననలు పొందాలి
సూర్యాపేట, 06 మార్చి 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- పేద ప్రజలకు ఉచిత సేవలు అందించి మన్ననలు పొందాలి అని ఏఐసిసి సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ మోరిశెట్టి నివేదిత లక్ష్యాది అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విద్యానగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ చిన్నారి పిల్లల హాస్పిటల్ ను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి తో కలిసి వారు ప్రారంభించి మాట్లాడారు. కార్పొరేట్ స్థాయిలో హైదరాబాద్ కు వెళ్లకుండా సూర్యాపేట లో అన్ని వసతులతో అన్ని రకాల వ్యాధులకు వైద్యం అందుబాటులో ఉండడం అభినందనీయమన్నారు.సూర్యాపేట వ్యాపార రంగంలో ఎంతో అభివృద్ధి చెందుతోందనీ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు క్యాంపు లు ఏర్పాటు చేసి ఉచిత వైద్యం అందించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో 44 వ వార్డు కౌన్సిలర్ గుణగంటి హేమ సతీష్, మున్సిపల్ కౌన్సిలర్ నాగుల వాసు, కొండపల్లి దిలిప్ రెడ్డి, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరెణి శ్రీనివాస్, పట్టణ కాంగ్రెస్ ఓబీసీ సెల్ అధ్యక్షులు రావుల రాంబాబు, జిల్లా కాంగ్రెస్ నాయకులు మద్దెబోయిన శ్రీనివాస్, నారాయణ ప్రవీణ్ రెడ్డి, నాగేల్లి అరుణ్, 44 వ వార్డు ప్రముఖులు బంధు వీరయ్య, బంధు శ్రీధర్,రాజా రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.