పెన్షన్ పెంపుపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి!
ఎన్ పి ఆర్ డి జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్
రామన్నపేట 02 అక్టోబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- పెన్షన్ పెంపు, ప్రతి నెల మొదటి వారంలో పెన్షన్ చేలించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ డిమాండ్ చేశారు.బుధవారం రోజు రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామంలో గ్రామ కమిటీల సమావేశం సంఘం గ్రామ అధ్యక్షులు బొడ్డుపల్లి అంజయ్య అధ్యక్షతన జరిగింది.ఈ సందర్బంగా ఎన్ పి ఆర్ డి జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ మాట్లాడుతూ..అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.10 నెలల నుండి 44 లక్షల మంది ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ పెంపు కోసం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తీవ్ర వైకాల్యం కలిగిన వికలాంగులకు ప్రత్యేక అలావెన్స్ ఇవ్వడానికి లబ్ధిదారుల ఎంపిక వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. సదరం క్యాంపుల నిర్వహణ అస్తవ్యాస్తంగా తయారు అయ్యిందన్నారు.క్యాంపుల దగ్గర కనీస సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వo 21రకాల వైకల్యాల ప్రకారం వికలాంగుల జనాభా లెక్కలు తీయాలని డిమాండ్ చేశారు.నామినేటెడ్ పదవులలో వికలాంగులకు రిజర్వేషన్ అమలు చేసే విదంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు వికలాంగుల సంక్షేమo, సాధికారత కోసం ప్రత్యేక పథకాలను అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో వికలాంగులు ఎదురుకుంటున్న సమస్యలపై చర్చించడం కోసం అక్టోబర్ 25-27 తేదీల్లో ఎన్ పి ఆర్ డి రాష్ట్ర 4వ మహాసభలు సుందరయ్య భవనంలో జరుగుతున్న ఈ మహాసభలను జయప్రదం చేయాలని అదేవిధంగా హైదరాబాద్ లో ఇంద్ర పార్క్ వద్ద 25-10-2024 రోజున జరిగే బహిరంగ సభకు జిల్లా మండల గ్రామాల్లోని పెద్ద సంఖ్యల పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. అనంతరం నిదానపెళ్లి గ్రామ కమిటీ ఎన్నుకోవడం అనంతరం కరపత్రం విడుదల చేయడం జరిగింది.
ఈ సమావేశంలో గౌరవ అధ్యక్షులు బి యాదయ్య అధ్యక్షులు బొడ్డుపల్లి అంజయ్య ప్రధాన కార్యదర్శి వంగాల రాజు ఉపాధ్యక్షులు ప్రభుదాస్ మరో ఉపాధ్యక్షులు శ్రీను సహాయక కార్యదర్శి వర్కాల మల్లేష్ కోశాధికారి వరకాల శ్రీను తదితరులు పాల్గొన్నారు.