పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ  టీకాల కార్యక్రమం.

Oct 30, 2024 - 15:21
 0  28
పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ  టీకాల కార్యక్రమం.
పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ  టీకాల కార్యక్రమం.

జోగులాంబ గద్వాల 30 అక్టోబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- ఇటిక్యాల రాజశ్రీ గార్లపాడు గ్రామంలో పశువులకు గాలి కుంటూ నివారణ టీకాల కార్యక్రమం తో పాటుగా గర్భకోశ వ్యాధి చికిత్స శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఎదకు రాని పశువులకు చూడి కట్టని పశువులకు పరీక్షలు చేసి పశువులకు చికిత్స చేయడం జరిగింది. జిల్లా పశువైద్య మరియు పశువు సమర్థవక శాఖ అధికారి వెంకటేశ్వర్లు శిబిరాన్ని సందర్శించి కొన్ని పశువులకు స్వయంగా పరీక్షించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన పాడి రైతులతో మాట్లాడుతూ పశువులలో పోషణ ప్రాముఖ్యతను ప్రజలకు అవగాహన కల్పించారు. సరియైన పోషణతో సకాలంలో పశువులు చుడి కట్టడం పాల ఉత్పత్తి దూడల యాజమాన్యం నికి వివరించారు. ఈరోజు శిబిరంలో 16 గేద జాతికి,5 ఆవులకు, పరీక్ష జరిపి చికిత్స అందించడం  జరిగిందని ఇటిక్యాల వెటర్నరీ డాక్టర్ భువనేశ్వరి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శంకరయ్య, డాక్టర్ వెంకట్ రాజు, డాక్టర్ భువనేశ్వరి, డాక్టర్ ప్రియాంక ,డాక్టర్ శిరీష, గోపాలమిత్ర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333