పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా

Dec 24, 2024 - 19:05
Dec 24, 2024 - 22:43
 0  20
పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా

 ప్రారంభానికి సిద్ధంగా మొండ్యల తొగు బ్లాక్ బెర్రీ 

 పర్యాటకులను ఆకర్షించేల బ్లాక్ బెర్రీ దివి ఉంటుంది

తాడ్వాయి తెలంగాణ వార్త డిసెంబర్ 24:- బ్లాక్ బెర్రీ ని ట్రయల్ రన్ చేసిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క 

సోమవారం రాత్రి తాడ్వాయి మండలములోనీ మొండ్యాల తొగు సమీపం లోనీ బ్లాక్ బెర్రీ దీవిని  

రాష్ట్ర పంచాయితి రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క,  మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్, భద్రాచలం నియోజక వర్గం శాసన సభ్యులు తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్, ఐటిడిఏ పిఓ చిత్రా మిశ్రా, డి ఎఫ్ ఓ రాహూల్ కిషన్ జాదవ్, గ్రంథాలయ చైర్మన్ బానోత్ రవిచందర్ లతో కలిసి సందర్శించారు

అనంతరం మాట్లాడుతూ ఇది ఆఫ్రికా అడవులు కాదు అమెరికా అసలే కాదు అమెజన్ అడవి అంతకన్నా కాదు ఇది మా ములుగు జిల్లా లోని తాడ్వాయి మండలం లోని మొండ్యాల తోగు బ్లాక్ బెర్రీ దివి అని మంత్రి వర్యులు సీతక్క గారు అన్నారు 

పర్యాటకులను ఆకర్షించే విధంగా ములుగు జిల్లా లో అనేకమైన టూరిజం ను అభివృద్ధి చేసి చూపిస్తామని 

ఇప్పటికే మా ములుగు జిల్లా లో లక్నవరం,రామప్ప,బొగత 

జలపాతం,లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం,

ఆదివాసులు జాతర మేడారం లాంటి అనేక ప్రాంతాలు ఉన్నాయని ప్రకృతిని ఆస్వాదిస్తూ పర్యాటకులకు ఆహ్లాదం కలిగించే విధంగా మా ములుగు జిల్లా టూరిజం హబ్ గా ఉండటం మాకు గర్వకారణమని మేము కూడా 

ఇలాంటి స్పట్లను గుర్తించి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పం తో మా జిల్లా కలెక్టర్ గారు మరియు డిఎఫ్ఓ ఇతర శాఖల అధికారులు పని చేస్తున్నారని వారిని ఈ సందర్భంగా అభినందిస్తూ ఈ జిల్లా ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసే భాధ్యత మన అందరిపైనా ఉందని మంత్రి గారు అన్నారు

ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు కాంగ్రెస్ పార్టీ జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Alli Prashanth ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్