పదో తరగతి విద్యార్థులకు పరీక్షల సంసిద్ధత వేల సాయంత్రం అల్పాహారం సరే.
పదో తరగతి విద్యార్థులకు పరీక్షల సంసిద్ధత వేల సాయంత్రం అల్పాహారం సరే.
ఇప్పుడు మాత్రమే కాకుండా పోషకాహారాన్ని నిరంతరం సరఫరా చేయాలి.
ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలంతా పేద పిల్లలే
భోజన ఏజెన్సీల రేట్లు పెంచితేనే ఆలోచనలు విజయవంతమౌతాయి.
-- వడ్డేపల్లి మల్లేశం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలకు సిద్ధమయ్యే కాలంలో అల్పాహారాన్ని ఇవ్వడం మనం గమనించినo. అదే సందర్భంలో ప్రతిరోజు మధ్యాహ్న భోజనంలో మాత్రం నాణ్యమైన పోషకాహారం కాకుండా మొక్కుబడిగా సరఫరా చేయడం వలన పేద పిల్లలు మాత్రమే చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వల్ల పెద్దగా వొనగోరిన ప్రయోజనం ఏమీ లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా ఈ పథకాన్ని కొనసాగించినప్పటికీ ఆనాటి నుండి నేటి వరకు ఆ వ్యవస్థలో సక్రమమైనటువంటి సంస్కరణలు జరగలేదు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా టిఆర్ఎస్ పాలనలో ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో కూడా ఫుడ్ పాయిజన్ అనే అంశం ప్రధానంగా చోటు చేసుకోవడం విషాదకరం. భోజన ఏజెన్సీల నిర్లక్ష్యమని సరఫరా వస్తువుల యొక్క అపరిశుభ్రత అని నాణ్యతలేని వస్తువుల కారణంగా అని లేదా భోజన ఏజెన్సీలకు ఖర్చుకు తగిన స్థాయిలో డబ్బులు చెల్లించకపోవడం వలన కూడా ఈ లోపం జరుగుతున్నట్లు ఇటీవల తేలిన నేపథ్యంలో ఇప్పటికే అరకొరగా ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు చదువుతుంటే ప్రభుత్వ రంగంలోని వివిధ పాఠశాలల్లోని పిల్లలందరూ పేదవాళ్లే కనుక వారి కనుకూలమైనటువంటి మధ్యాహ్న సాయంత్రం భోజనంతో పాటు పరీక్షల వేల సరఫరా చేసే అల్పాహారంలో కూడా నాణ్యమైన పోషక విలువలు ఉండేలా చూడడం ద్వారా మాత్రమే ప్రభుత్వ రంగాన్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఉన్నత వర్గాల పిల్లలంతా ప్రైవేటు పాఠశాలలకు వెళ్లడం ఆనవాయితీగా మారింది ఇప్పటికే 60 లక్షల విద్యార్థుల వ్యవస్థ తెలంగాణ వరకు చూస్తే ఒకనాడు ప్రభుత్వ పాఠశాలల్లో 30 లక్షలు ఉంటే ప్రస్తుతం 20- 24 లక్షలమధ్య ఉండడం గమనించదగినటువంటి వ్యతిరేక పరిణామం .
అల్పాహారం సరఫరాకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వు
***********
రెసిడెన్షియల్ పాఠశాలను మినహాయించి భోజన సౌకర్యం లేనటువంటి మోడల్ పాఠశాలలో జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఫిబ్రవరి2025 ఒకటవ తేదీ నుండి పదవ తరగతి విద్యార్థులకు సాయంత్రం పూట పరీక్షలకు సిద్ధమ య్యే సమయంలో అల్పాహారాన్ని సరఫరా చేయడానికి సంబంధించి ప్రభుత్వం 29 జనవరి నాడు ఉత్తర్వు జారీ చేసినట్లు తెలుస్తున్నది. మధ్యాహ్నం భోజనం తర్వాత సాయంత్రం పదవ తరగతికి సిద్ధమయ్యే విద్యార్థులకు తరగతులు పూర్తి కావాలంటే కనీసం 7 గంటలు దాటే అవకాశం ఉంది కనుక ఆకలితో అలమటిస్తూ ఇబ్బంది పడే బదులు వారిని శారీరకంగా మానసికంగా సంసిద్ధంగా ఉండే విధంగా తీర్చిదిద్దడం కోసం సాయంత్రం అల్పాహారం అంటూ tgs ప్రత్యేకమైనటువంటి ఆలోచన చేయడంసభభైనదే. గతంలో కొన్నిసార్లు స్థానిక సంస్థలు స్వచ్ఛంద సంస్థల వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించిన సందర్భములుండే ది. 2023 లోను విద్యాశాఖ సమగ్ర శిక్ష ద్వారా 34రోజులు అందించినట్లుగా తెలుస్తుంది. గతంలో ఈ బాధ్యతను జిల్లా కలెక్టర్లు తమ నిధులనుండి చూసుకున్నట్లుగా తెలిస్తే ఈసారి మాత్రం మార్చి 21వ తేదీ నుండి 10వ తరగతి పరీక్షలు జరగనున్న నేపథ్యంలో వారిని సమగ్రంగా సిద్ధంగా తీర్చిదిద్దడానికి ఫిబ్రవరి 1 నుండి మార్చి 20వ తేదీ మధ్య పాఠశాల నడిచే 38 రోజుల పాటు అల్పాహారం ఇవ్వడానికి ప్రభుత్వం అనుమతించడంతోపాటు ఒక్కో విద్యార్థికి రోజుకు 15 రూపాయల చొప్పున కేటాయించినట్లుగా తెలుస్తుంది. సుమారు తెలంగాణ రాష్ట్రంలోని 4500 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, 194 మోడల్ స్కూల్ లలో కలిసి 1,90,000 మంది పదో తరగతి విద్యార్థులు ఉన్నట్లుగా అంచనాలున్న నేపథ్యంలో వీరందరికీ 38 రోజుల పాటు అల్పాహారం అందించాలంటే సుమారు 11 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు.
రోజు చారు,పస లేని సాదా భోజనం అయితే అల్పాహారానికి ఇంత ప్రత్యేకతనా?
**********
అవును ఈ అనుమానం ఎవరికైనా వస్తుంది ఎందుకంటే సంవత్సరాంతం మధ్యాహ్న భోజనము లోపల మామూలు చారు పెద్దగా పోషకాహారం లేనటువంటి కూరగాయలు మొక్కుబడి భోజనంతో నడుస్తూ ఉంటే దానివల్ల పేద పిల్లలకు పెద్దగా ఒరిగేది ఏమీ లేదు. ఇప్పటికి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఆర్థికంగా పేద పరిస్థితి నుండి వస్తున్న సందర్భంలో వారిని విద్యావంతులుగా తీర్చిదిద్ది భావి సవాళ్లను అధిగమించేలా చేయాలంటే సమగ్రమైన పోషకాహారాన్ని సరఫరా చేసే బదులు ప్రభుత్వాలు మొక్కుబడిగా వ్యవహరిస్తే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. కానీ పరీక్షల సమయంలో మాత్రం కేవలం పదవ తరగతి విద్యార్థులకు కొంత పోషకాహారాన్ని సరఫరా చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తున్నది వాళ్ళు ఇచ్చిన మెనూ ప్రకారంగా " ఉడకబెట్టిన పెసలు, పల్లీలు, బెల్లం పట్టీలు, చిరు ధాన్యాలతో చేసిన మిల్లెట్స్ బిస్కెట్లు, ఉడకబెట్టిన బొబ్బర్లు, ఉల్లిపాయ పకోడీ, ఉడకబెట్టిన శనగల్ వంటి వాటిని రోజుకు ఒక రకంగా తయారు చేసి ఇవ్వాలని భోజన ఏజెన్సీలకే ఈ బాధ్యతను అప్పజెప్తూ తీసుకున్న నిర్ణయం స్వాగతించవలసిందె. కానీ ప్రతిరోజు నిర్వహిస్తున్నటువంటి మధ్యాహ్న భోజనంలో కూడా ఇలాంటి నాణ్యమైనటువంటి పోషక విలువలు కలిగినటువంటి ఆహార పదార్థాలను జోడించినప్పుడు మాత్రమే ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది. అంతేకాదు ఇతర పాఠశాలల నుండి కూడా ప్రభుత్వ పాఠశాలలకు మరి కొంతమంది విద్యార్థులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన పౌష్టిక ఆహారాన్ని సరఫరా చేయగలిగినప్పుడు, ప్రభుత్వ పాఠశాలల పైన కొటారి సూచించినట్లుగా రాస్ట్రాలు 30% నిధులు కేటాయించగలిగితే ఢిల్లీ లాగా ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న పిల్లలందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలోకి వచ్చే ఆస్కారం ఉంటుంది. నాణ్యమైన విద్య నాణ్యమైన భోజనం ప్రధానమైనది అనే ఆలోచన ప్రభుత్వాలకు ఉండాలి. కానీ కేంద్ర ప్రభుత్వం 2 శాతం కూడా నిధులు కేటాయించకపోతే రాష్ట్రాలు 5-6 శాతం మాత్రమే కేటాయిస్తుంటే ఏ మూలకు సరిపోవడం లేదు అనేది నగ్న సత్యం. కేవలం ఢిల్లీ కేరళ వంటి రాష్ట్రాలు కొన్ని మాత్రమే 24, 25 శాతం కేటాయిస్తున్నట్లు తేలితే మిగతా రాష్ట్రాలు కూడా ఆ రాష్ట్రాలను అనుసరించవలసినటువంటి అవసరం కూడా ఉన్నది. ఈ నిర్ణయాన్ని కేవలం తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే పరిమితం చేయకుండా భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే పేద వర్గాల పిల్లల కోసం అనునిత్యంతో పాటు పరీక్షల వేల సరఫరా చేసే ప్రత్యేక అల్పాహారంలో కూడా నాణ్యమైన ఆహార పదార్థాలను అందించగలిగితే ఎక్కువ మొత్తము లోపల నిధులను ప్రభుత్వం మంజూరు చేసి ఫుడ్ పాయిజన్ కాకుండా చూడగలిగినప్పుడు అంతేకాదు భోజనం ఏజెన్సీలకు తగిన స్థాయిలో నిధులను మంజూరు చేసి వారి జీవన ప్రమాణాలను పెంచగలిగినప్పుడు మాత్రమే పాఠశాలల్లో భోజనం ఇతర పౌష్టికాహారం అల్పాహారం వంటి కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. వీటిపైన ప్రభుత్వ పాఠశాలకు వచ్చే పిల్లల సంఖ్య కూడా ఆధారపడి ఉంటుంది. ఈ ప్రణాళికను కచ్చితంగా ప్రభుత్వాలు చిత్తశుద్ధిగా అమలు చేయడం ద్వారా భవిష్యత్తులో విద్య మొత్తం కూడా ప్రభుత్వ రంగంలోనే కొనసాగడానికి అవకాశం ఉంటుంది. ఆ వైపుగా ప్రభుత్వాలు దృష్టి సారించి నిధులను మంజూరు చేసి బడ్జెట్లో కేటాయించినప్పుడు ప్రభుత్వ రంగంలోనే సమర్థమైన ప్రతిభ గల విద్యను అందించడానికి ఆస్కారం ఉంటుంది అభివృద్ధి చెందినటువంటి అమెరికా కెనడా లాంటి దేశాలలో కామన్ స్కూల్ విధానం ద్వారా సమానత్వాన్ని సాధిస్తూ ఉచిత నాణ్యమైన విద్యను ప్రజలందరికీ సమానంగా అందిస్తుంటే మనదేశంలో ఆ సమానతలు అంతరాలు ఆదాయంలోను సంపదలోను విచ్చలవిడిగా కొనసాగుతున్న నేపథ్యంలో కామన్ స్కూల్ ను అమలు చేయకుండా బడ్జెట్ను ఎక్కువ కేటాయించకుండా ఉన్నప్పుడు ప్రభుత్వ పాఠశాలలు కేవలం భోజనశాలలుగా మిగిలిపోతే ఎంత అప్రతిష్టనో ప్రభుత్వాలు ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ప్రస్తుతం భారతదేశంలో పాఠశాల స్థాయి విద్యార్థులు 26 కోట్ల మంది ఉంటే అందులో 60 శాతం మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నట్లు తెలుస్తున్నది. ఉన్నవారిని భావి సవాళ్లను అధిగమించే విధంగా తయారు చేయాలన్న ప్రైవేటు పాఠశాలలో చదివే వారిని ప్రభుత్వ రంగంలోకి ఆహ్వానించాలన్న ప్రభుత్వ పాఠశాలల్లో వసతులతో పాటు భోజన సౌకర్యం కూడా సంపూర్ణ నాణ్యమైన స్థాయిలో ఉంటే తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు అత్యున్నత స్థాయికి చేరుకోగలరo టే సందేహం లేదు.
( ఈ వ్యాసవ సామాజిక రాజకీయ విశ్లేషకులు అరసం రాష్ట్ర కమిటీ సభ్యులు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట)