పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్లు ఓటు నమోదు చేసుకోండి. ఎమ్మెల్యే శ్రీ శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు

Nov 4, 2024 - 19:18
Nov 4, 2024 - 19:21
 0  20
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్లు ఓటు నమోదు చేసుకోండి. ఎమ్మెల్యే శ్రీ శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు

ఏపీ తెలంగాణ వార్త ప్రతినిధి :- పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్లకు ఓటు నమోదు చేసుకోండి. ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్ తాతయ్య గారు. ఈనెల (నవంబర్) 6 వ తేదీ ఆఖరి తేదీ. జగ్గయ్యపేట పట్టణం మెప్మా ఆఫీసు నందు ఎమ్మెల్సీ ఎన్నికలు ఓటు హక్కు ఎలా నమోదు చేయించాలి అనే దానిపై అవగాహన సదస్సు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు శ్రీ శ్రీరాం రాజగోపాల్ తాతయ్య గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య గారు మాట్లాడుతూ.

కృష్ణ -గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటు హక్కు నమోదు గడువు ఈనెల (నవంబర్) 6 వ తేదీ వరకు మాత్రమేనని అర్హులైన పట్టుభద్రులంతా తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని కోరారు. ఫారం 18 పూర్తి చేయడంతో పాటు డిగ్రీ ప్రొవిజినల్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీ పై గజిటెడ్ అధికారితో సంతకం చేయించి జతపరచాలన్నారు. అలాగే ఆధార్, ఓటర్ కార్డు జిరాక్స్ కాపీలను కూడా జత చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో కట్టా వెంకట నరసింహారావు,పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి మైనేని రాధాకృష్ణ, జిల్లా సమైక్య సెక్రటరీ షేక్ నజీమున్, తెలుగుదేశం పార్టీ నాయకులు గెల్లా వైకుంఠేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State