నేషనల్ టాలెంట్ ఎగ్జామినేషన్(ఎన్టెక్స)లో అల్ ఇండియా 5వ ర్యాంక్ సాధించిన తాత్విక

Apr 19, 2025 - 18:55
 0  93
నేషనల్ టాలెంట్ ఎగ్జామినేషన్(ఎన్టెక్స)లో అల్ ఇండియా 5వ ర్యాంక్ సాధించిన తాత్విక

రవీంద్ర భారతిలో సన్మానించిన సి నాప్స్ సంస్థ

అడ్డగూడూరు19 ఏప్రిల్ 2025 తెలంగాణవార్త రిపోర్టుర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రానికి చెందిన విద్యుత్ లైన్ మెన్ బాలెంల దుర్గయ్య త్రివేణి- కళ్యాణిల చిన్న కూతురు బాలెంల తాత్విక నేషనల్ టాలెంట్ ఎగ్జామినేషన్(ఎన్టెక్స)లో 8వతరగతి స్థాయిలో అల్ ఇండియా ఐదవ ర్యాంక్,తెలంగాణ రాష్ట్ర స్థాయి,4వ ర్యాంక్ సాదించింది తాత్వికను సి.నాప్స్ సంస్థ జీఏం గోపాల్ రెడ్డి ఏజీ ఏం మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రముఖ ఉస్మానియా ప్రొపెసర్ ల సమక్షంలో హైదరాబాద్ లోని రవీంద్ర భారతి లో ఘనంగా సన్మానం చేశారు.2023లో 6వ తరగతి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ప్రధమ ర్యాంక్ సాదిచడం జరిగింది.అప్పుడు కూడా రవీంద్ర భారతి లో సన్మానం చేయడం జరిగింది.ఈ ఇలాంటి పరీక్షలు అన్ని రకాల తరగతుల వారికి నిర్వహించడం జరుగుతుంది.అది అల్ ఇండియా స్థాయిలో నిర్వహించడం జరుగుతుంది అని నిర్వాహకులు తెలిపారు.జీ ఏం గోపాల్ రెడ్డి మాట్లాడుతూమా..నారాయణ సంస్థ విద్యార్థులను ఎప్పుడు ప్రోత్సహిస్తు వారిపైన ప్రత్యేక దృష్టిలో చూస్తుంది అన్నారు.అందుకే నారాయణ విద్య సంస్థలు దేశ,రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధిస్తుంది అని అన్నారు.మేము ఎప్పుడు ముందు వరుసలో ఉన్న వారిని సన్మానిస్తే మిగతా వారిలో కూడా పట్టుదల పెరిగి విద్యా పైన దృష్టి పెట్టి  ఉన్నతంగా విద్యాను అభ్యసిస్తారు అని అన్నారు.ఈ కార్యక్రమంలో నారాయణ కొంగరి కాలాన్ బ్రాంచ్ ప్రిన్సిపాల్ రజిని, ఉపాధ్యాయురాలు నవ్య శ్రీ,శాగంటి రామనర్సయ్య, వంటెపాక సుందర్, వెంకటమ్మ,ఉపాసన తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333