నేతకానిల సమస్యలపై వినతి పత్రం
*నేతకానిల సమస్యలపై వినతి పత్రం*
ములుగు ఆగస్టు 29 తెలంగాణ వార్త:- తెలంగాణ రాష్టంలో ఉన్న నేతకాని కులస్థుల సమస్యలపై గురువారం ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టి, ఎస్ కు నేతకాని కుల హక్కుల పరిరక్షణ సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు జాడి రాంబాబు ఆధ్వర్యంలో నేతకాని సమస్యలు నేతకాని కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్ చేయాలనీ వినతి పత్రం వివ్వడం జరిగింది. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని లేని పక్షంలో ఎస్సీ కార్పొరేషన్ నిధులలో తగిన ప్రాధాన్యత కల్పించాలనీ,హైదరాబాద్ వేదికగా నేతకాని కులస్తులకు నేతకాని భవన్ ఏర్పాటు చేయాలని,నేతకానీలకు విద్య ,ఉద్యోగ అవకాశాలలో తగిన ప్రాధాన్యత కల్పించాలి.నేతకానిలకు సివిల్స్, గ్రూప్స్ లో ఫ్రీ కోచింగ్ ఇచ్చే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని, మొదలగు నేతకాని సమస్యలపై ములుగు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని చెప్పడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు దికొండ కాంతారావు,మంగపేట మండల అధ్యక్షులు జాడి సాంబశివరావు,కన్నాయిగు డెం మండల అధ్యక్షులు సునారికాని రాంబాబు,జనగం సంతోష్ పాల్గొనడం జరిగింది.