నేడు మూడు వందేభారత్ రైళ్లను ప్రారంభించనున్న ప్రధాని మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం మూడు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించనున్నారు. మూడు రైళ్లలో రెండు సర్వీసులు దక్షిణ రైల్వే జోన్‌కు సంబంధించినవి. తమిళనాడులోని చెన్నై ఎగ్మోర్- నాగర్‌కోయిల్, మదురై- బెంగళూరు కంటోన్మెంట్ మధ్య నడవనున్నాయి. చెన్నై సెంట్రల్, మదురై జంక్షన్ స్టేషన్లలో వేడుకలు జరగనున్నాయి. మూడో రైలు యూపీలోని మీరట్- లక్నో మధ్య నడవనుంది.