నెట్టెం పాడు 104 ప్యాకేజీ ఎండిన వరి పంటను పరిశీలించిన బిజెపి నాయకులు

Mar 12, 2025 - 19:57
Mar 12, 2025 - 21:19
 0  5

నెట్టెం పాడు  ఎండిన కాలువ లో  క్రికెట్ ఆడి నిరసన..

జోగులాంబ గద్వాల 12 మార్చి 2025 తెలంగాణవార్త ప్రతినిధి.:- ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ బిజెపి మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డికె. అరుణమ్మ . రైతుల కోసం గతంలో ఎమ్మెల్యేగా ఉన్నపుడు రెండు లక్షల ఎకరాలకు నీరు అందించే లక్ష్యంగా ఆరోజు నెట్టెం పాడు ప్రాజెక్టు పనులను 90%శాతం పనులను పూర్తి చేయడం జరిగింది..కానీ గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం మిగిలిన పనులు కూడా పూర్తి చేయకుండా రైతులను నట్టేట ముంచారు .. వాస్తవంగా ర్యాలం పాడు 4TMC లు ,గుడ్డేం దొడ్డి 1TMC, తాటికుంటా 1.45TMC ,ముచ్చొనిపల్లి 1.45 TMCనాగర్ దొడ్డి 0.69 TMC లు ఉండాలి కానీ ఏ రిజర్వాయర్ కూడా పూర్తి సామర్థ్యం లేకుండా రైతులను మోసం చేస్తున్నారు.. పూర్తి సామర్థ్యం నిండితే ఖరీఫ్ కు 2 లక్షల ఎకరాలు, రబికి లక్ష ఎకరాలు నీళ్లు అందుతాయి.. కానీ ఖరీఫ్ లో  లక్ష ఎకరాలకు రబి కు అధికారుల లెక్క ప్రకారం 24 వేల ఎకరాలకు మాత్రమే నీళ్లు అందుతున్నాయని అన్నారు.. కానీ రైతుల పరిస్థితి ఏంది?.. గద్వాల్ ,అల్లంపూర్ కు పూర్తిస్థాయి నీళ్లు అందాలంటే 104 ,105, 106, 107 ప్యాకేజీలు వెంటనే పూర్తి చేయాలని అన్నారు..104 ప్యాకేజ్ పూర్తి చేసి కొండాపురం ,కేటి దొడ్డి, నందిన్మే, ఇర్కి చెడు, చివరి ఆయకట్టు వరకు నీళ్లు ఇవ్వాలని అన్నారు..107 చివరి ఆయకట్ట అయినా బలిగేరా, గట్టు ,మాచర్ల ,ఇందూ వాసి, బొయిలగూడెం నీళ్లు ఇవ్వాలని అన్నారు.. 99, 100 ప్యాకేజీ పూర్తి చేసి 70 వేల ఎకరాలకు నీళ్ళందించాలి..గట్టు  ఎత్తిపోతల పథకం వెంటనే పూర్తి చేసి ఖరీఫ్ కు రెండు లక్షల ఎకరాలు, రబి కు ఒక లక్ష ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది.. లేనిపక్షంలో రైతుల పక్షాన పాదయాత్రతో న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు..


  ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రవి కుమార్ ఎక్బోటే,జిల్లా ఉపాధ్యక్షుడు రజక నరసింహ,మాజీ అసెంబ్లీ కన్వీనర్ రామాంజనేయులు, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు దేవా దాస్,  మండల అధ్యక్షులు శ్రీపాద రెడ్డి చెనుగోని పల్లి శ్రీను,కెటి దొడ్డి మండల నాయకులు హానిమి రెడ్డి, ఎర్ర బీమ్ రెడ్డి, నల్లారెడ్డి,మైల గడ్డ రాముడు, సాయన్న,  రాముడు ,దేవెందర్ రెడ్డి కృష్ణకాంత్ వాచానయక తదితరులు ఉన్నారు..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333