నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలి! విద్యార్థి సంఘ నాయకులు సుల్తాన్ నరేష్

మద్దిరాల 04 జూలై 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- తుంగతుర్తి నియోజకవర్గం సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రంలోని మద్దిరాల జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ ను నీట్ పేపర్ లీకేజీని నిరసిస్తూ రాష్ట్ర ఎన్ ఎస్ యు ఐ పిలుపుమేరకు మద్దిరాల మండల ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షుడు సుల్తాన్ నరేష్ ఆధ్వర్యంలో బంద్ చేయడం జరిగింది. స్టూడెంట్ నాయకులు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నీట్ పేపర్ లీకేజీ గురించి నిమ్మకు నీరెత్తినట్లు వివరిస్తుంది దీనిపై పార్లమెంట్ సమావేశంలో ప్రతిపక్షం నేతైన రాహుల్ గాంధీ లేవనెత్తితే దానిపై చర్చ జరగకుండా రాహుల్ గాంధీ గొంతు నొక్కి ప్రయత్నం చేశారు. దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు నీట్ పేపర్ లీకేజ్ కి బలి కావడం జరిగింది.అలాగే మన తెలుగు రాష్ట్రంలోనే 74 వేల విద్యార్థులు ఈ పేపర్ లీకేజ్ వల్ల నష్టపోవడం జరిగింది. దీనికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తూ ప్రధానమంత్రి మంత్రులు రాజీనామా చేయాలని అలాగే నీట్ పరీక్షలు రద్దుచేసి నీట్ పేపరను రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఒప్పజప్పాలని డిమాండ్ చేస్తున్నాను.
ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యు ఐ నాయకులు నెల్లుట్ల సుబ్బు సోహెల్ పాశం నితిన్ ,కసనబోయినగణేష్ , బత్తుల వంశీ,బోలగాని ఉపేందర్, చామకూరి సైదులు, కార్తీక్, ప్రవీణ్ ,మహేష్ , సంపత్ తదితరులు పాల్గొన్నారు.