నిలిచిపోయిన లింకు రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలి

తిరుమలగిరి 25 మే 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:
తిరుమలగిరి మండలం తొండ గ్రామం నుండి కొడకండ్ల మండలం కడగుట్ట తండా వరకు మూడు కిలోమీటర్ల మేర చేపట్టినటువంటి రోడ్డు నిర్మాణ పనులు అకాలంగా నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షాకాలం సమీపిస్తున్నడంతో ఇటు వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, అటు ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందికరంగా, రోడ్డు గుంతల మయంగా ఉన్నది. కావున వెంటనే సదరు కాంట్రాక్టర్ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాలని రైతులు వేడుకుంటున్నారు. రైతులు తిపిరాల సోమయ్య, ధరావత్ అమీన్ , ధరావత్ ఉపేందర్, ధరావత్ రవి లు పాల్గొన్నారు