నిర్మాణంలో ఉన్న గ్రంథాలయ భవనంను పూర్తి చేసి పాఠకులకు అందుబాటులోకి తీసుకురావాలి
ప్రస్తుతం ఉన్న గ్రంధాలయంలో మౌలిక సదుపాయాలు కల్పించాలి
జిల్లా కలెక్టర్ శ్రీ రిజ్వాన్ భాషా షేక్ కి వినతి
బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు మరియు జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య
జోగులాంబ గద్వాల 15 మే 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల. జిల్లా కేంద్రం లోని జిల్లా కలెక్టర్ గ్రంధాలయాన్ని సందర్శించిన సందర్భంగా వారికి పాఠకులతో కలిసి వినతి పత్రాన్ని ఇచ్చిన బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కురువ పల్లయ్య
* తక్షణమే జిల్లా కలెక్టర్ ప్రత్యేక నిధుల నుండి మౌలిక సదుపాయాలు కల్పించాలి.
* జిల్లా ప్రజా ప్రతినిధులు మరియు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే గ్రంథాలయాన్ని నిర్మాణాన్ని పూర్తి చేసే విధంగా కృషి చేయాలని డిమాండ్.
ఈ సందర్బంగా బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కురువ పల్లయ్య మాట్లాడుతూ....
* ప్రస్తుతం ఉన్న గ్రంథాలయంలో బాత్రూంలు లేక మహిళా పాఠకులకు తీవ్రమైన ఇబ్బందులు ఉన్నాయి, అదేవిధంగా బాయ్స్ పాఠకులకు కూడా బాత్ రూమ్స్ ఇబ్బందులు ఉన్నాయి.
* బాత్రూం సరిగా లేక దుర్గంధం వాసన చుట్టుపక్కల మొత్తం వ్యాపిస్తున్నది గాలి పీల్చడానికి కూడా ఇబ్బందికరంగా ఉన్నది.
* గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా పలుమార్లు విన్నవించిన, పలుమార్లు నిరసన తెలిపిన కూడా ఇక్కడ బాత్రూమ్స్ సమస్యలు మాత్రం తీరడం లేదు.
* జిల్లా కేంద్రానికి జిల్లా నలుమూలల నుండి అనేక గ్రామాల నుంచి పాఠకులు చదువుకోడానికి నిత్యం జిల్లా కేంద్రానికి వస్తున్నారు.
* కానీ ఇక్కడ కూర్చోవడానికి సీట్ కెపాసిటీ లేదు.
* సదుపాయాలు లేవు.
* ప్రస్తుతం ఉన్న గ్రంథాలయంలో అప్డేట్ అయిన మెటీరియల్స్ లేవు.
* మ్యాగజైన్స్ లేవు.
* కంప్యూటర్స్ పనిచేయడం లేదు.
* లోపల మొత్తం దుమ్ము ధూళితో కూడుకొని ఉన్నది పరిశుభ్రత లోపించింది.
* తక్షణమే నిర్మాణంలో ఉన్న గ్రంథాలయ భవనం పూర్తి చేసి బాటకులకు అందుబాటులోకి తీసుకురావాలి.
* ప్రస్తుతం ఇక్కడున్న కోర్టును కాల్ చేయడం జరిగింది. దానిని కూడా గ్రంథాలయ పాఠకులకు కేటాయించాలని జిల్లా కలెక్టర్ కి విన్నవించారు. ఈ కార్యక్రమం లో పాఠకులు బండారి అభిషేక్, మాధవ్ కిరణ్ రమేష్ గోవిందు, చక్రి, కృష్ణ, చక్రవర్తి, యువరాజు, రంగస్వామి,నరసింహ తదితరులు పాల్గొన్నారు.