నారాయణ పేట ఆర్డీవో పి.రాంచందర్ 25వేలు లంచం తీసుకుంటుండగా
నారాయణ పేట ఆర్డీవో పి.రాంచందర్ 25వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నా ఏసీబీ బృందం..డీఎస్పీ సీ.హెచ్ బాలకృష్ణ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. గద్వాల జిల్లా గద్వాల ఆర్డిఓ విధులు నిర్వహించిన క్రమంలో భారీ స్థాయిలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు విన్నవిస్తున్నాయి. గద్వాలలో విధులు నిర్వహించిన క్రమంలో లేని భూములకు ఓ ఆర్ సి మంజూరుకు పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారని ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. తను విధులు నిర్వహించిన అన్ని జిల్లాల్లో అధికారులు నివేదికలు కోరినట్లు సమాచారం. పలు కార్యాలయంలో సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం తన సొంత ప్రాంతంలో కూడా విచారణ బృందం సోదలకు వెళ్లిందని సమాచారం. గద్వాల ఆర్డీవో కార్యాలయంలో జరిగిన పలు అక్రమాలపై ఓ అధికారి తనకు బినామీగా ఉన్నాడని గుర్తించి, ఆ అధికారి ఇళ్లలపై కూడా శోధాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.