నరేంద్ర మోడీ పరిపాలనలో పేదరికం తగ్గింది

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్:- నరేంద్ర మోడీ పరిపాలనలో పేదరికం తగ్గింది.. మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు.. ఆత్మకూరు ఎస్.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేద ప్రజల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను తీసుకురావడం వలన పేదరికం తగ్గుతుందని మాజీ ఎమ్మెల్యే బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు అన్నారు. మండల పరిధిలోనీ నెమ్మికల్ లో జరిగిన బిజెపి మండల సమావేశం లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రైతుల కోసం కిసాన్ సమ్మాన్ నిధి, ఫసల్ బీమా యోజన ,చిరు వ్యాపారుల కోసం ముద్రా రుణాలు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా ఇండ్లను కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఇందిరమ్మ ఇండ్లుగా ప్రచారం చేసుకుంటుందనీ అన్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతుబంధు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి... రైతు పండించిన ధాన్యం ప్రభుత్వం ఎప్పుడు కొనుగోలు చేస్తుందో తెలియని పరిస్థితి ఉందనీ తెలిపారు.రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తేనే కేంద్రం అందించే సంక్షేమ పథకాలు అన్ని రాష్ట్రంలో అమలవుతాయన్నారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన మండల సభ్యులందరూ మండలంలో పార్టీ పటిష్టత కోసం సమన్వయంతో కలసి పనిచేయాలని సూచించారు. *నూతన మండల కార్యవర్గం నియామకం* భారతీయ జనతా పార్టీ ఆత్మకూరు ఎస్ మండల కార్యవర్గ సమావేశం మండల పార్టీ అధ్యక్షులు సంద్యాల సైదులు ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నూతన మండల కమిటీని ప్రకటించారు .మండల ప్రధాన కార్యదర్శులుగా పాటి కరుణాకర్ రెడ్డి , తుడి సారయ్య , ఉపాధ్యక్షులుగా , సకినాల వెంకన్న, బానోత్ బిక్కు నాయక్, తండు లింగయ్య, చందా కృష్ణమూర్తి, కుoచo ఉప్పలయ్య, తొట్ల సమత , బోనగిరి సోమలక్ష్మి, కోశాధికారిగా సంద్యాల మాధవి లను నియమించారు. భారతీయ జనతా యువమోర్చా మండల అధ్యక్షులుగా గోపగాని భాను ప్రకాష్ , కిసాన్ మోర్చా మండల అధ్యక్షులుగా సోమిరెడ్డి వీరారెడ్డి, దళిత మోర్చా మండల అధ్యక్షులుగా ఆరేoపుల వంశీ, గిరిజన మోర్చా మండల అధ్యక్షులుగా గుగులోత్ రవీందర్ ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులుగా తొట్ల సైదులు లను నియమించారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సభ్యులను సంకినేని వెంకటేశ్వరరావు శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు.ఇటీవల జిల్లా కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికైన పందిరి రాంరెడ్డి నీ శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు.