నమ్మినవారికి న్యాయం చేయడం
మాకు తెలుసు, నమ్మిన వారిని నడ్డి విడచడం మీకు తెలుసు

28-12-2024 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం:- చిన్నంబావి మండల పరిసర ప్రాంతమైన గూడెం కొత్త వెంకట్ రెడ్డి % కొత్త నారాయణరెడ్డి 1980-1985 వరకు ఏబీవీపీ లో చేరి అబ్రహం ఆధ్వర్యంలో చెరగని ముద్ర వేసిన వెంకట్ రెడ్డి. అక్కడికే ఆగకుండా 1985లో రవీంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో బిజెపిలో చేరి అప్పటినుండి ఇప్పటివరకు బిజెపిలోనే ఉంటూ బిజెపికి నమ్మినబంటుగా పనిచేస్తూ బిజెపిలో బిజెపి సీనియర్ నేత బండి సంజయ్ వెంకట్ రెడ్డిని,నీవు బిజెపికి నమ్మినబంటు కావున నిన్ను నేను శాలువతో సన్మానిస్తాను, సత్కరిస్తాను, అని నిన్న బిజెపి ఆఫీసులో వెంకట్ రెడ్డిని బండి సంజయ్ శాలువాతో సన్మానించడం జరిగింది. బండి సంజయ్ మాట్లాడుతూ దీనికంటే ముందు 1980లో ఏబీవీపీ లో ఉన్నప్పుడు ఆ తర్వాత 1985లో బిజెపి పార్టీ గురించి తెలిసి తెలవని వయసులో బిజెపిలో చేరినప్పుడు అప్పుడున్న నక్సలైట్లను ఎదుర్కొని నక్సలైట్లకి ఎదురీత ఇది నా దమ్మున్న బిజెపి లీడర్ వెంకట్ రెడ్డి. 1994లో పద్మజా రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పద్మజా రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడిి వీపనగండ్ల ల మండల ఎంపిటిసిగా పోటీ చేసి 35 ఓట్లతో స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగినది. అయినా పట్టు వదలకుండా, బిజెపి కండువను వదలకుండా ఆరోజు నుండి ఈరోజు వరకు గల్లీ నుండి ఢిల్లీ వరకు పదవులు లేకున్నా ప్రజల కోసం పనిచేసే మానవత్వం కలిగి ఉన్న ప్రజల మనిషి మన వెంకట్ రెడ్డి. అని బండి సంజయ్ పేర్కొన్నాడు. వెంకట్ రెడ్డి సొంత గ్రామమైన బేక్కెం గూడెంలో ఆయన మాటకు ఎదురులేకుండా అతని మాటనే శాసనం. 1980 నుండి అంచలంచలుగా ఎదుగుతూ ఢిల్లీ పెద్దల మదిలో అతని పేరు నిలిచిందంటే,తెలిసేలా శభాష్ అనిపించు కున్నాడు అంటే అతను ఎంతటి గొప్ప మేధావో మనకు అర్థం అయిపోతుంది అని బండి సంజయ్ పేర్కొన్నాడు.వెంకట్ రెడ్డి మాట్లాడుతూ చిన్నంబావిమండలా ప్రజలకు శతకోపురం పెట్టి కళ్లకు కనిపించకుండా రూపురేఖలు మార్చిన వారి అందరికీ తిరిగి ఆ శతోపురాన్ని వారంతట వారే ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచేలా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రజలకు అండగా నిలబడతా బడుగు బలహీన వర్గాలకు కేంద్ర మంత్రులు సహకారంతో ఎలాంటి ఆపదలు వచ్చినా ఎలాంటి బెదిరింపులు వచ్చిన వాటన్నింటినీ న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా అడుగడుగునా ప్రజల చెంత నిలబడతానని వెంకట్ రెడ్డి అన్నారు. చిన్నంబావి మండలం ఏర్పడి ఆరు సంవత్సరాలు పూర్తి అయిన రూపురేఖలు మారలేదు వీటన్నింటికీ మార్పు రావాలంటే ప్రజలమందరం కలిసికట్టుగా ఉండకపోవడమే దీనికి ఒక మచ్చుతునకగా మారిపోయింది.కాబట్టి ప్రజలందరూ కలిసి పార్టీ భేదాలు లేకుండా కష్టపడితేనే చిన్న భావి మండలం విలువను పెంచగలుగుతాము, లేదంటే అది ఎప్పటికైనా మూల ప్రాంతం గానే మిగిలిపోతుంది. నేడు ఉన్న పార్టీ రేపు ఉండదు నేడు ఉన్న నాయకుడు రేపు మీ ముందు ఉండడు ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మండల అభివృద్ధికి నాతో పాటు నడిచేవారు ముందుకు వస్తే కేంద్ర బిజెపి సహకారంతో వీలైనంత త్వరగా చిన్నంబావి మండల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.