ధరూర్ కేజీబీవీలో నైట్ వాచ్‌మెన్ పోస్టుకు దరఖాస్తు ఆహ్వానం
జోగులాంబ గద్వాల 31 ఆగస్టు 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : ధరూర్: ధరూర్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో నైట్ వాచ్‌మెన్ పోస్టుకు ధరూర్ మండల కేంద్రంలో స్థానికంగా ఉండే మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కేజీబీవీ, జూనియర్ కళాశాల ఎస్‌ఓ. గోమతి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పోస్టుకు పదో తరగతి ఉత్తీర్ణత సాధించినవారు 18 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలన్నారు. అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు తమ దరఖాస్తులను ధరూర్ కేజీబీవీలో అందజేసి ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్‌ఓ. గోమతి కోరారు.