దేశ ప్రజలను ఒక తాటిపైకి తెచ్చిన గీతం వందేమాతరం.. డికె.. స్నిగ్ధ రెడ్డి
జోగులాంబ గద్వాల 25 సెప్టెంబర్ 226 తెలంగాణ వార్త ప్రతినిధి : వందేమాతరం జాతీయ గీతం 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గద్వాల పట్టణంలోని స్వకులశాలి ఫంక్షన్ హాల్‌లో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డికె.. స్నిగ్ధ రెడ్డి పాల్గొని వందేమాతరం గీతం ప్రాధాన్యతను వివరించారు. దేశ ప్రజల్లో జాతీయ భావాన్ని, దేశభక్తి స్ఫూర్తిని పెంపొందించడంలో వందేమాతరం గీతం కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. దేశ ప్రజలను ఒకే తాటిపైకి తీసుకువచ్చిన గొప్ప జాతీయ గీతంగా వందేమాతరం నిలిచిందని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో వందేమాతరం గీతం అధికారిక రూపాన్ని సామూహికంగా ఆలపించే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. యువతలో దేశభక్తి భావనను మరింత బలపరచడం, జాతీయ గీతానికి గౌరవం పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ వందేమాతరం స్ఫూర్తిని గౌరవిస్తూ దేశ ఐక్యత, సమగ్రత కోసం కృషి చేయాలని డీకే. స్నిగ్ధ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు,RSS జిల్లా సంఘ్ చాలక్ గోపాల్ రావ్ ఎక్బోటే, ధర్మ ప్రసార సమితి అధ్యక్షుడు జగదీశ్వర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రవి కుమార్ ఎక్బోటే, జిల్లా బిజెవైఎం అధ్యక్షుడు బాబుల్ రెడ్డి, పట్టణ అధ్యక్షురాలు రజక జయశ్రీ, బిజెపి సీనియర్ నాయకులు మీర్జా పురం వెంకటేశ్వర రెడ్డి పరమేశ్వర్ రెడ్డి తదితరులు ఉన్నారు..