**దేశంలో జరిగే జన గణనలో కుల గణన చేర్చాలి*
తెలంగాణ వార్త ప్రతినిధి కోదాడ : దేశంలో జరిగే జనగణనలో కుల గణన చేర్చాలి
బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనుంజయ నాయుడు డిమాండ్
దేశవ్యాప్తంగా జనగణన చేపట్టి అందులో భాగంగా కులగణన చేపట్టాలని బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
బుధవారం నాడు సూర్యాపేట జిల్లా కోదాడలో బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ముందు జరిగిన ధర్నాకు హాజరైన ఆయన మాట్లాడుతూ.... భారత రాజ్యాంగం ఈ దేశంలోని ప్రజలందరికీ జాతి కుల వర్గ లింగ వివక్ష లేకుండా సమానత్వాన్ని సమాన అవకాశాలను కల్పిస్తామని హామీ ఇచ్చిందని, కేంద్రంలో రాష్ట్రంలో సగానికి పైగా ఉన్న ప్రజల జీవన ప్రమాణాలను పెరగకుండా ఎన్నటికీ అభివృద్ధి సాధ్యం కాదు అని అందుకని సామాజిక న్యాయం సమగ్ర అభివృద్ధి జరగాలంటే అన్ని రంగాలలో సంపద అంతా వికేంద్రీకరణ జరగాలని, అందుకు ముఖ్యంగా ఈ దేశంలో జంతు గణలతో పాటు అన్నింటికీ లెక్కలు ఉన్నాయని కానీ సగానికి పైగా ఉన్న బీసీ కుల గణన లెక్కలు తీయమంటే కేంద్రం కుంటి సాకులు చూపిస్తోందని, సాంకేతిక లోపాలు వస్తాయని చెబుతుందని ఏకాభిప్రాయం కావాలని ప్రజలకు కల్లబొల్లి మాటలు చెబుతోందని కానీ అది నిజం కాదని దేశ జన గణనలో బీసీ కులగణనను చేసి వారికి విద్య ఉపాధి రంగాల్లో మేమంతో మాకు అంత వాటాకల్పించాలని , ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.
పది సంవత్సరాల కింద తెలంగాణలో 52% బీసీలు ఉండగా పది సంవత్సరాల తర్వాత నేడు అది 46 శాతానికి తగ్గిందని ప్రభుత్వ లెక్కలు చెప్పడం అనుమానాలకు తావిస్తుందని ఆయన అన్నారు అనంతరం ఆర్డీవో సూర్యనారాయణకు వినతిపత్రం ఇవ్వడం జరిగిందిఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల శ్రీనివాసరావు సిపిఐ పట్టణ కార్యదర్శి షేక్ లతీఫ్ బీసీ నాయకులు ఉపతల శ్రీనివాస్ గౌరీ నాయుడు టి శ్రీనివాస్ లక్ష్మణ్ తిరుపయ్య వెంకటేష్ కొండలు పి కనకయ్య మహేష్ షేక్ జానీ తదితరులు పాల్గొన్నారు