తుంగతుర్తి నియోజకవర్గ యూట్యూబ్ న్యూస్ చానల్స్ అసోసియేషన్
అధ్యక్షుని గా నియమితులైన షేక్ జానీ
తుంగతుర్తి నవంబర్ 16 తెలంగాణ వార్తా ప్రతినిధి:- సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ యూట్యూబ్ న్యూస్ చానల్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా టీవీ999 అసెంబ్లీ ఇన్చార్జి స్టాఫ్ రిపోర్టర్ షేక్ జానీ ని వ్యవస్థాపక,జాతీయ అధ్యక్షులు టైగర్ పురం సంతోష్ కుమార్,జాతీయ ప్రధాన కార్యదర్శి గూడెం మధు గౌడ్ ఆదేశాల మేరకు రాష్ట్ర ఉపాధ్యక్షులు రెంటాల కరుణ కుమార్ శనివారం రోజున అధికారికంగా నియమించారు.ఈ సందర్భంగా జాని మీడియాతో మాట్లాడుతూ నా ఎన్నికకు సహకరించిన వ్యవస్థాపక,జాతీయ అధ్యక్షులు టైగర్ పురం సంతోష్ కుమార్,జాతీయ ప్రధాన కార్యదర్శి గూడెం మధు గౌడ్,రాష్ట్ర ఉపాధ్యక్షులు రెంటాల కరుణ కుమార్ గారికి,రాష్ట్ర కార్యదర్శి డీఎస్ యాదవ్ గారికి,సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బాలకృష్ణ గార్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని యూట్యూబ్ న్యూస్ చానల్స్ నీ ఎవరైనా అవమాన పరిచే విధంగా ప్రచారం చేస్తే వారిపై స్థానిక పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదు చేస్తామని,ప్రభుత్వానికి ఇటు ప్రజలకు వారధిగా పని చేస్తున్న మాపై ఎవరైనా దాడులకు,బెదిరింపులకు,హత్య ప్రయత్నం చేసిన మా జాతీయ అధ్యక్షులు టైగర్ పురం సంతోష్ కుమార్ నేతృత్వంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని,జని తెలిపారు.