తిరుమలగిరి ఎస్ఐ గా సిహెచ్ వెంకటేశ్వర్లు

తిరుమలగిరి 17 మార్చి 2025 తెలంగాణవార్త రిపోర్టర్: సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల నూతన సబ్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన సిహెచ్ వెంకటేశ్వర్లు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదులకు సమన్వయం అందిస్తానని తెలిపారు. సమస్యలు పరిష్కరిస్తూ.. మండలంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా కృషి చేస్తానని, అదేవిధంగా మండలంలోని ప్రజలందరూ పోలీసు వారికి సహకరించాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని వారు తెలియజేశారు.