తిరుమలగిరిలో బిజెపి శ్రేణుల సంబరాలు
కేంద్రంలో బిజెపి ప్రభుత్వ ఏర్పాటుతో హర్షం వ్యక్తం.!
ముచ్చటగా మూడవసారి ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం
తిరుమలగిరి 10 జూన్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- కేంద్రంలో ముచ్చటగా మూడవసారి బిజెపి సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు కావడం పట్ల సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో బిజెపి శ్రేణులు టపాకాయలు కాల్చి హర్షం వ్యక్తం చేశారు.భారతీయ జనతా పార్టీని మూడు పర్యాయాలు అధికారంలోకి తీసుకువచ్చి జనోద్దారక నాయకునిగా నరేంద్ర మోడీ మూడవసారి భారత ప్రధానిగా ఎంపిక పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ మోడీ ప్రమాణ స్వీకారం తో సంబరాలు నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల్లో 8 ఎమ్మెల్యే సీట్లు,లోక సభ 8 ఎంపీలు బిజెపి గెలవడం,రాబోయే రోజుల్లో 88 అసెంబ్లీ స్థానాలు గెలిచి రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తిరుమలగిరి మున్సిపాలిటీ గడ్డపై బిజెపి జెండా ఎగరవేస్తామని 2వ వార్డు కౌన్సిలర్,బిజెపి పట్టణ అధ్యక్షుడు చిర్రబోయిన హనుమంతు యాదవ్ అన్నారు.తెలంగాణ రాష్ట్రం నుండి కేంద్ర మంత్రులుగా జి.కిషన్ రెడ్డి,బండి సంజయ్ ఇద్దరు ఎంపీలు ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మేడబోయిన యాదగిరి,కొండ సోమయ్య,మూల వెంకటరెడ్డి,మేకల శ్రీనివాస్ రెడ్డి,మూల వెంకన్న,కొమ్ము నవీన్ యాదవ్,సురేష్ రెడ్డి,అంకిరెడ్డి,నాగలక్ష్మి,చంద్రకళ,బోడ మల్లయ్య,శ్రీకాంత్,శ్యామల,పర్రెపాటి లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.