జోగులాంబ గద్వాల జిల్లా ప్రజలు హెచ్ఎంపివీ (HMPV) వైరస్తో భయానికి గురికావద్దు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్ కే సిద్ధప్ప .

జోగులాంబ గద్వాల 10 జనవరి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్ కే సిద్ధప్ప జిల్లా ప్రజలందరికీ ఈ విధంగా తెలియజేస్తున్నారు... హెచ్ఎంపివీ వైరస్ అనేది 2001 నుండి ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడిన శ్వాసకోస వైరస్... అందరికీ తెలుసునని ఇట్టి వైరస్ చైనాలో వ్యాప్తి చెందడంతొ ఇటీవల అందరి దృష్టిని ఆకర్షించింది హెచ్ఎంటీవీ అనేది అనేక శ్వాస కోసం వైరస్లలో ఒకటి ఇది అన్ని వయసులో ప్రజలలో ముఖ్యంగా శీతాకాలం మరియు వసంత రుతువు ప్రారంభంలో ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది వైరస్ సంక్రమణ సాధారణంగా స్వీయ పరిమితి స్థితి మరియు చాలా సందర్భాలలో వాటంతట అదే కోల్కుంటుంది... హెచ్ఎంపివీ కొత్త వైరస్ మహమ్మారి ముప్పు కాదు అని ప్రజలు భయభ్రాంతులకు గురి కావద్దని తెలిపారు... ముఖ్యంగా ప్రజలు చేయవలసినవి....
1... నోరు మరియు ముక్కును రుమాల్తో కప్పుకోవాలి.. లేదా మాస్క్ ను ధరించాలి 2... బయటికి వెళ్లి వచ్చినప్పుడు చేతులను సబ్బుతో శుభ్రపరచుకోవాలి.... లేదా శానిటైజర్ లను వాడాలి...3... రద్దీగా ఉండే ప్రదేశాలను సాధ్యమైనంతవరకు నివారించుకోవాలి.. బాధపడుతున్న వ్యక్తుల నుండి దూరంగా ఉండాలి...4... దగ్గు జ్వరం మరియు తుమ్ములు ఉంటే బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండాలి...5.... ప్రతిరోజు పుష్కలంగా నీరు త్రాగాలి మరియు పోస్టుకాహారం తీసుకోవాలి...6... ఉంటే ఇంట్లోనే ఉండాలి మరి ఇతరులతో సంబంధాన్ని పరిమితం చేయాలి... మరియు తగినంత నిద్రపోవాలి..ప్రజలు చేయకూడనివి....
1... ఒకరి చేతులు ఒకరి చేతులతో కలపకూడదు...2... టిష్యూ పేపర్ మరియు రుమాలు సాధ్యమైనంత వరకు వాడరాదు...3... అనారోగ్య వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు కళ్ళు ముక్కు నోటిని తరచుగా తాకకూడదు....4... బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం మంచిది కాదు.... డాక్టర్ కి తెలియకుండా స్వయంగా మందులు తీసుకోరాదు.... వంటివి పాటించాలని తెలిపారు
ప్రస్తుతం హెచ్ఎంపివీ వైరస్ నుంచి ప్రజలకు ఎలాంటి భయం గాని ఆందోళనకు గురి కావద్దని.... జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఎప్పటికప్పుడు వ్యాధులపై పర్యవేక్షణ చేస్తు ప్రజలకు అందరికీ జాగ్రత్తలు తెలియజేస్తున్నారు.. చికిత్సలు అందివ్వడానికి స్టాఫ్ సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
గద్వాల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వినోద్ కి తప్పనిసరిగా.. ILI / SARI... కేసులు వచ్చినచో ఐసోలేషన్ వార్డు మరియు తగినంత బెడ్లను,మరియు ఆక్సిజన్ కొరత లేకుండా,అన్నీ కూడా సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు