జై బాపు జై భీమ్ జై సంవిదన్ రాజ్యాంగ పరిరక్షణ భారీ ర్యాలీ

తిరుమలగిరి 19 ఏప్రిల్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మండల మామిడాల గ్రామంలో తుంగతుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు మందుల సామేలు ఆదేశానుసారం. జై బాపు జై భీమ్ జై సంవిధాన్ మండల కోఆర్డినేటర్ ఎర్ర యాదగిరి ఆధ్వర్యంలో మామిడాల గ్రామంలో భారత రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని, వ్యవస్థలని భారత రాజ్యాంగాన్ని కాలరాస్తూ ప్రజలకు కావలసిన సమాన హక్కులను స్వేచ్ఛలను అవమానపరుస్తూ పరిపాలన చేస్తుంది ఈ సందర్భంలో భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్క పౌరుడు పైన ఉందని, భారత రాజ్యాంగాన్ని కాపాడాలనే దృఢ సంకల్పం తో కాంగ్రెస్ పార్టీ మహాత్మ గాంధీ అనుసరించిన శాంతి, అహింస సిద్ధాంతాలను అస్త్రాలుగా చేసుకొని, రాజ్యాంగం లోని ఆర్టికల్స్ వివరిస్తూ, గ్రామంలోని ప్రజలను చైతన్య పరుస్తూ ముందుకు సాగుతున్నది అని అన్నారు..ఈ కార్యక్రమంలో తిరుమలగిరి మండల అధ్యక్షులు ఎల్సొజు నరేష్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ధరావత్ జుమ్మి లాల్ నాయక్, గ్రామశాఖ అధ్యక్షులు గజ్జి లింగయ్య, గూగులోత్ సుధాకర్, ఎస్టి సెల్ అధ్యక్షులు గుగులోతు ప్రేమ్ ప్రసాద్, తుంగతుర్తి నియోజకవర్గం మైనార్టీ సెల్ యం డి ఆఫీస్, మాజీ ఎంపిటిసి దుపెల్లి అబ్బాస్, మండల యువజన అధ్యక్షులు కుర్ర శ్రీనివాస్, దాచపల్లి వెంకన్న, దాచేపల్లి శ్రీనివాస్, బాలకృష్ణ, శేఖర్ రెడ్డి లతో పాటూ మండల నాయకులు గ్రామ నాయకులు తదితరు పాల్గొన్నారు.