జూన్ 15న ఆర్వపల్లిలో టిఆర్ఎస్ పార్టీ సమావేశంకు అందరూ హాజరు కావాలి
బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి
అడ్డగూడూరు 13 జూన్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– తుంగతుర్తి నియోజకవర్గం అర్వపల్లి మండల కేంద్రంలో లక్ష్మీ ఫంక్షన్ హాల్లో 15వ తేదీ సోమవారం రోజు తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్"గాదరి కిషోర్ కుమార్ అధ్యక్షతన తుంగతుర్తి నియోజకవర్గ బూత్ లెవెల్ ఏజెంట్లు మరియు బిఆర్ఎస్ డిజిటల్ సభ్యత్వ ఇంచార్జీల సమావేశం నిర్వహించబడును. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వర్యులు సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీష్ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జీ రాష్ట్ర బిఆర్ఎస్ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జిల్లా పార్టీ అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ నియోజక వర్గం సభ్యత్వ ఇంచార్జీ యలగందుల వెంకటేశ్వర్లు హాజరవుతున్నారు కావున ప్రతి గ్రామం నుంచి పేర్లు పంపిన బూత్ ఏజెంట్ మరియు సభ్యత్వ ఇంచార్జీలు. సర్పంచ్ లు. మాజీ ప్రజా ప్రతినిధులు మండల.గ్రామ పార్టీ ముఖ్య నాయకులు తప్పనిసరిగా హాజరు కాగలరు.కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు లో పూర్తిగా విఫలమైంది. వర్షాకాలం ప్రారంభం అయి 20రోజులు అవుతున్న వ్యవసాయ శాఖ ప్రణాళిక మీద స్థానిక ఎమ్మెల్యే కానీ జిల్లా మంత్రి కానీ ఇంతవరకు రివ్యూ జరిపిన పాపాన పోలేదు.గత రెండున్నర ఏండ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా రైతు వ్యతిరేఖ..ప్రజా వ్యతిరేఖ విధానాలు అవలంవిస్తుంది కావున కాంగ్రెస్ ప్రభుత్వానికి.కాంగ్రెస్ పార్టీకి తగిన గుణ పాఠం చెప్పేందుకు జరుగుతున్న నేపథ్యంలో ప్రతిఒక్కరు భాద్యతగా సమావేశానికి హాజరు కావాలని ఒక ప్రకటనలో తెలిపారు.