జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాల యందు రెపరెపలాడిన మువ్వన్నెల జెండా

Jan 26, 2025 - 18:17
Jan 26, 2025 - 19:45
 0  3
జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాల యందు రెపరెపలాడిన మువ్వన్నెల జెండా

చర్ల మండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల (పాతచర్ల) 76 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా హెచ్ ఎం బీసమ్మ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం రిపబ్లిక్ డే ఆవశ్యకత గురించి విద్యార్థినీ లకు వివరించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ఆటల పోటీలలో గెలుపొందిన విద్యార్థినీ లకు బహుమతులను ప్రధానం చేశారు. అనంతరం బాలికలు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో డి అమ్మాజీ ఎం సుజాత జి చిన్న జగ్గు డి పద్మలత ఎన్ వీణ కే విజయ్ కుమార్ కే ధనలక్ష్మి సి ఆర్ పి రామకృష్ణ గిరిజన బాలికల హాస్టల్ వార్డెన్ జి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.