జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఉపాధ్యాయుడుకృష్ణ కు

Sep 5, 2026 - 19:28
 0  2
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఉపాధ్యాయుడుకృష్ణ కు

వావిలాల గ్రామ సర్పంచ్ చిన్న మోహన్ గౌడ్ అభినందనలు.

జోగులాంబ గద్వాల 5 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- ఇటిక్యాల. మండలంలోని వావిలాల గ్రామంలోని ఎంపీపీ ఎస్ పాఠశాల  ఉపాధ్యాయుడు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కృష్ణ కు వావిలాల గ్రామ సర్పంచ్ చిన్న మోహన్ గౌడ్ అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ  వృత్తికి అంకిత భావంతో సేవలందిస్తూ విద్యార్థుల భవిష్యత్తు కోసం నిరంతరం కృషి చేస్తున్న మీకు జిల్లా ఉత్తమ అవార్డు అందడం మాకు ఎంతో గర్వంగా ఉందని వావిలాల గ్రామ సర్పంచ్ చిన్న మోహన్ గౌడ్ అన్నారు. ఈ ప్రతిష్టాత్మక పురస్కారం మీ సేవలకు లభించిన సముచిత గుర్తింపు ఇలాంటి ఎన్నో విజయాలు సాధిస్తూ విద్యారంగంలో మరింత ఉన్నత శిఖరాలకు అధిరోదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333