జిల్లా అధ్యక్షుడిగా మళ్లీ ఏకగ్రీవంగా చక్రవర్తి చార్యులు ఎన్నుకున్న అర్చకులు

Jun 7, 2026 - 23:19
Jun 7, 2026 - 23:21
 0  0
జిల్లా అధ్యక్షుడిగా మళ్లీ ఏకగ్రీవంగా చక్రవర్తి చార్యులు ఎన్నుకున్న అర్చకులు
జిల్లా అధ్యక్షుడిగా మళ్లీ ఏకగ్రీవంగా చక్రవర్తి చార్యులు ఎన్నుకున్న అర్చకులు

జోగులాంబ గద్వాల, 7జూన్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి :- జిల్లా ధూప దీప నైవేద్య అర్చక సంఘం జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న చక్రవర్తి చార్యులను మరోసారి ఏకగ్రీవంగా జిల్లా అధ్యక్షుడిగా సంఘ సభ్యులు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మండల ఇన్‌చార్జిలుగా శేఖర్, తిరుమలేష్, శ్రవణ్, శివ, ఆంజనేయులను కూడా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా చక్రవర్తి చార్యులు మాట్లాడుతూ తనపై మరోసారి నమ్మకం ఉంచి జిల్లా అధ్యక్ష బాధ్యతలను అప్పగించిన అర్చక సంఘ సభ్యులకు, మండల ప్రతినిధులకు హృదయపూర్వక ధన్యవాదాలు మరియు శుభాభివందనాలు తెలిపారు. అనంతరం "శ్రీరామ జయరామ జయ జయ రామ" నామస్మరణతో మల్దకల్ శ్రీ తిమ్మప్ప స్వామి ఆలయానికి భజనతో వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి శుభాశీస్సులు స్వీకరించిన అనంతరం అర్చక సంఘ బలోపేతానికి, అర్చకుల సంక్షేమానికి, సనాతన ధర్మ పరిరక్షణకు కంకణబద్ధులై పనిచేస్తామని చక్రవర్తి చార్యులు తెలిపారు. సంఘ ఐక్యత, అర్చకుల అభ్యున్నతి, ఆలయాల అభివృద్ధి కోసం అందరూ కలిసి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. "సనాతన ధర్మ రక్షణే మన ప్రధాన లక్ష్యం" అని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State