జాతీయ విద్యా దినోత్సవం కోదాడలో
తెలంగాణ వార్త ప్రతినిధి :- జాతీయ విద్యా దినోత్సవం కే.ఆర్.ఆర్. ప్రభుత్వ జూనియర్ కళాశాల కోదాడలో ఎన్.ఎస్.ఎస్ విభాగం ఆధ్వర్యంలో భారతదేశ మొట్టమొదటి విద్యాశాఖా మంత్రి, కవి, పాత్రికేయులు, స్వాతంత్ర్య సమరయోధులు, భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకల సందర్భంగా "జాతీయ విద్యా దినోత్సవం" నిర్వహించడం జరిగింది. కళాశాల ఎన్.ఎస్.ఎస్ విభాగం ప్రోగ్రాం అధికారి, తెలుగు లెక్చరర్ వేముల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో... కళాశాల ప్రిన్సిపాల్ యన్. రమణారెడ్డి ముందుగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి చిత్రపటానికి పూలమాల సమర్పించి నివాళులర్పించారు. తదనంతరం ఆయన మాట్లాడుతూ... భారత దేశ స్వాతంత్రం కోసం పోరాడి, స్వాతంత్రాన్ని తేవడమే కాకుండా, మతసామరస్యం కోసం అహర్నిశలు శ్రమించారని, భారతదేశంలో ఎడ్యుకేషన్ ఫౌండేషన్ కోసం వారు చేసిన కృషి అభినందనీయమన్నారు. అనేక భాషలలో నైపుణ్యం సంపాదించి, దేశంలోని విద్యావ్యవస్థలో ఐ.ఐ.టి, యు.జి.సి, ఐ.ఐ.ఎం లు స్థాపించి సాంకేతిక ఉన్నత విద్యలను చేరువలోకి తెచ్చారని అన్నారు. అలాగే దేశంలోని స్త్రీలకు, వయోజనులకు విద్యను అందుబాటులోకి తేవడంలో కీలక భూమిక పోషించారు. తన చివరి శ్వాస వరకు భారతదేశ పై ప్రేమను కలిగి ఉండి, అందరిలో దేశభక్తిని ఆకాంక్షించిన గొప్ప జాతీయతావాది, లౌకికవాది అని ఆయన అన్నారు. మౌలానా చూపించిన దారిలో నేటి యువత నడిచి దేశ ప్రతిష్టను ఇనుమడింప చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు జి. లక్ష్మయ్య, ఆర్ .పిచ్చి రెడ్డి, జి .యాదగిరి,వి. బల భీమారావు, ఆర్. రాజేష్, ఎం .రత్నకుమారి, బి. రమేష్ బాబు, జి .వెంకన్న, పి. తిరుమల ఆఫీసు సిబ్బంది కె. శాంతయ్య, ఆర్ .చంద్రశేఖర్, ఎస్.వెంకటేశ్వర చారి,మమత అధ్యాపకులు ఎస్. గోపికృష్ణ, ఎం. చంద్రశేఖర్, ఈ. నరసింహారెడ్డి, ఎస్. కే.ముస్తఫా, ఈ.సైదులు, ఎస్.కె.ఆరిఫ్, డి ఎస్ రావు, విద్యార్థులు మొదలగువారు పాల్గొన్నారు.