జాతీయ పక్షి నెమలి మృతి పట్టించుకోని అధికారులు

Aug 6, 2026 - 22:50
 0  4
జాతీయ పక్షి నెమలి మృతి పట్టించుకోని అధికారులు

తిరుమలగిరి 07 ఆగస్టు 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలోని మోత్కూర్ రోడ్డులో బాక్స్ టీ కేఫ్ సమీపంలో జాతీయ పక్షి నెమలి మృతి చెంది పడి ఉండటం కలకలం రేపింది ఎవరైనా వేటాడి తీసుకొచ్చి ఏదైనా కేసులు నమోదయితాయా అని భయపడి వదిలేసారా లేదా పొలాల్లో విష ప్రయోగం కారణంగాన లేక అనారోగ్యంతో నే నెమలి మృతి చెందిందా అనే అనుమానాలు వ్యక్తమైతున్నాయి ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు తెలియజేసిన అటవీ శాఖ అధికారులు చూసుకుంటారని చెప్పి తగిన చర్యలు చేపట్టలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు జాతీయ పక్షి మృతి చెందిన ఘటనను అధికారులు అత్యంత బాధ్యతగా తీసుకొని వెంటనే పంచనామ నిర్వహించి పోస్టుమార్టం ద్వారా అసలు మరణ కారణాలను వెలుగులోకి తీసుకురావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు అధికారుల నిర్లక్ష్యం వల్ల వన్యపురానుల సంరక్షణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి