జలమయమైన జిల్లా పశుసంవర్ధక శాఖ కార్యాలయం   

Jun 12, 2025 - 19:11
 0  10
జలమయమైన జిల్లా పశుసంవర్ధక శాఖ కార్యాలయం   
జలమయమైన జిల్లా పశుసంవర్ధక శాఖ కార్యాలయం   

జోగులాంబ గద్వాల 12 జూన్ 2020 5 తెలంగాణ వార్తా ప్రతినిధి :  గద్వాల రాత్రి కురిసిన వర్షానికి మేళ్లచెరువు రోడ్డు నుంచి పాలకేంద్రం అనంత ఫంక్షన్ హాల్ మీదుగా వస్తున్న వర్షపు నీరు మొత్తం జిల్లా పశుసంవర్ధక శాఖ కార్యాలయము మరియు పశువైద్యశాల లోపలికి ప్రవేశించి నిలిచిపోవడం జరిగినది రోజు పశు వైద్యశాలకు మూగజీవాలను తీసుకువచ్చే జంతు ప్రేమికులు వైద్యశాలకు పోలేని పరిస్థితి ఏర్పడింది మరియు పశుసంవర్ధక కార్యాలయ సిబ్బంది లోపలికి వెళ్ళటానికి నానా ఇబ్బందులు పడుతూ వెళ్లడం జరిగినది .కార్యాలయంలోపల నిలిచిన నీరు కాంపౌండ్ వాల్ ను రంద్రం  పెట్టి బయటికి పంపడానికి కార్యాలయ సిబ్బంది ప్రయత్నం చేసిన బయట ఉన్న డ్రైనేజీ కాలువను అక్కడే ఇల్లు నిర్మిస్తున్న ఇంటి ఓనర్లు ఆ యొక్క కాల్వపై ఇటుకలు కంకర మొదలగునవి వేసి కాలువను పూడ్చి వేయడం జరిగినది కాబట్టి ఆ యొక్క వర్షపునీరు బయటికి వెళ్లడానికి ఆస్కారం లేకుండా కార్యాలయం అంతా జలమైనది ఇట్టి విషయాన్ని మున్సిపల్ అధికారులకు చెబుదామన్న ఎవరు అందుబాటులోకి రావడం లేదని జిల్లా పశుసంవర్ధక కార్యాలయ సిబ్బంది వాపోతున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333