జన్మనిచ్చిన గ్రామ రుణం తీర్చుకుంటా మంత్రి ఉత్తమ్

May 4, 2025 - 21:46
 0  280
జన్మనిచ్చిన గ్రామ రుణం తీర్చుకుంటా మంత్రి ఉత్తమ్

 జన్మనిచ్చిన తాటిపాముల గ్రామాన్ని ఆదర్శంగా తీర్చి దిద్దుతా....

ప్రాధమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనాల నిర్మాణం కొరకు 2 కోట్ల రూపాయలు మంజూరు...

పలు అభివృద్ధి పనులకి శంఖుస్థాపన ...

దేశ రక్షణ కోసం పోరాడిన తాటిపాముల ముద్దుబిడ్డ నేడు రైతుల సంక్షేమం కోసం పోరాడుతున్నాడు...

తెలంగాణ ధాన్యపు రాసులతో కళకళలాడుతుంది.....

తిరుమలగిరి 05 మే 2025 తెలంగాణ వార్త రిపోర్టర్: 

జన్మనిచ్చిన తాటిపాముల గ్రామ రుణాన్ని ఏనాడు మర్చిపోను అని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామం లో 20 కోట్ల రూపాయలతో నిర్మించే యస్వంతపూర్ వాగుపై చెక్ డ్యామ్, రెండు వరసల వంతెన, 1 కోటి రూపాయలతో సిసి రోడ్లు,1 కోటి రూపాయలతో డ్రైనేజి నిర్మాణ పనులకి శంఖుస్థాపన కార్యక్రమం లో రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటో గ్రఫి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ లతో కలిసి రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ రైతుల సంక్షేమం కొరకు వాగుపై 20 కోట్ల రూపాయలతో చెక్ డ్యామ్ నిర్మిస్తున్నామని, దేవాదుల చివరి ప్యాకెజ్ నుండి చెన్నూరు రిజర్వాయర్ నుండి సాగునీరు తాటిపాముల మీదుగా తిరుమలగిరి తరలిస్తామని తెలిపారు. నా చిన్నతనంలో ఆ వాగుపై ఆడుకున్నామని గత జ్ఞాపికలు గుర్తు చేశారు.నలమాద రాఘవరెడ్డి మానవడిగా ఈ గ్రామం లో అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని 1 కోటి రూపాయలతో ఎంపిపిస్ పాఠశాల భవనం, 1 కోటి రూపాయలతో జడ్పీ హెచ్ ఎస్ భవనం మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. నా తండ్రి నలమాద పురుషోత్తం రెడ్డి పేరుమీద త్వరలో ఫంక్షన్ హాల్ నిర్మిస్తానని హామీ ఇచ్చారు. ఒక్కొక్క మిషన్ 7000 రూపాయలు విలువ చేసే 600 కుట్టు మిషన్లు మహిళలకి ఉచితంగా అందజేస్తున్నట్లు ప్రకటించారు. మరొక సారి గ్రామానికి వచ్చి గ్రామం అభివృద్ధిపై అందరితో మాట్లాడి గ్రామం అవసరాలు అన్ని తీర్చుతానని హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ తాటిపాముల గ్రామానికి చెందిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అప్పుడు పైలెట్ ప్రాణాలను లెక్క చేయకుండా దేశ రక్షణ కొరకు పోరాడినాడు ఇప్పుడు రైతుల సంక్షేమం కోసం పంట కొరకు సాగు నీరు ఇచ్చే నీటిపారుదల శాఖ మంత్రిగా అలాగే పంట పండిన వడ్లు కొనే పౌర సరఫరాల శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తూ ప్రతి పేదోడి కంచంలో సన్న బియ్యం పెడుతున్నాడు.భారతదేశం లోనే తెలంగాణ రాష్ట్రము అత్యధికంగా వరి పంట పండించి రికార్డు సృష్టించిందని తెలిపారు. వానాకాలం 151 లక్షల మెట్రిక్ టన్నులు, యాసంగి లో 127 లక్షల మెట్రిక్ టన్నులు పండించి రెండు సీజన్ లలో ప్రతి ఊరు ధాన్యం రాశులతో కళ కళ లాడిందని తెలిపారు. వరి పంట పడించటంలో ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రధమ స్థానం లో ఉండి ప్రతి పేదోడి కంచంలో సన్నబియ్యం పెట్టి అన్నపూర్ణగా మారిందని తెలిపారు.తాటిపాముల రైతులకోసం నేడు చెక్ డ్యామ్ పనులకు శంఖుస్థాపన చేయటం చాలా సంతోషంగా ఉండని త్వరలో ఎస్ ఎల్ బి సి పూర్తి అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా సస్యాశ్యామలం అవుతుందని తెలిపారు.  ఈ కార్యక్రమం లో భువనగిరి ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, అగ్రికల్చర్ కమిషన్ మెంబర్ చెవిటి వెంకన్న యాదవ్, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సుధీర్ రెడ్డి,ఎస్పి కే నరసింహ, అదనపు కలెక్టర్ పి రాంబాబు, ఇరిగేషన్ ఎస్ ఈ రమేష్ బాబు,ప్రజా ప్రతినిధులు,అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034