చేయూత పింఛన్ కొరకు దరఖాస్తు చేసుకోండి ఎంపీడీవో

Sep 7, 2026 - 20:01
 0  9
చేయూత పింఛన్ కొరకు దరఖాస్తు చేసుకోండి ఎంపీడీవో

 జోగులాంబ గద్వాల 7 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి ;  ఇటిక్యాల . మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు చేయూత పింఛన్ కొరకు వారి వారి గ్రామాలలో పంచాయతీ కార్యదర్శులని కలసి  ఈనెల 15/9/2026వ తారీఖు వరకు దరఖాస్తు తీసుకోవాలని ఎంపీడీవో అన్నారు.  ఎంపీడీవో రమాదేవి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  పింఛన్  దరఖాస్తు చేసుకునేవారు ఒంటరి మహిళ, వితంతువు, అంగవైకల్యము, ఉన్నవారు ఈనెల 15/9/2026వ తారీఖు లోపల దరఖాస్తు చేసుకోవాలని ప్రజలను ఎంపీడీవో రమాదేవి కోరారు. దరఖాస్తు చేసుకునే సమయం లో సర్టిఫికెట్లు లేకున్నా కూడా దరఖాస్తు చేసుకోవాలని ప్రజలను కోరారు.
 
 అధికారులు వెరిఫికేషన్ వచ్చినప్పుడు పూర్తి సర్టిఫికెట్లతో అధికారులకు చూపించి సర్టిఫికెట్లు ఉంటే వారికి పెన్షన్ మంజూరు అవుతుందని  ఎంపీడీవో పేర్కొన్నారు.
 ఈ అవకాశాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో కోరారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333