చెడుపై మంచి సాధించిన విజయమే హోలీ

Mar 14, 2025 - 20:39
Mar 14, 2025 - 23:04
 0  8
చెడుపై మంచి సాధించిన విజయమే హోలీ

 జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులు నిమ్మల శ్రీనివాస్ గౌడ్. 

సహజరంగులను వాడి ప్రకృతిని కాపాడాలి.

రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు, జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీర స్వామి గౌడ్.

 (సూర్యాపేట టౌన్, మార్చి 14) :- చెడుపై మంచి సాధించిన విజయమే హోలీ పండగగా జరుపుకోవడం దేశంలో ఆనవాయితీగా వస్తుందని జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్, జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు నిమ్మల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ కార్యాలయం వద్ద జిల్లా అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన హోలీ వేడుకలకు హాజరై రంగులు చల్లుకున్నా అనంతరం శుభాకాంక్షలు తెలిపి మాట్లాడారు. కులమతాలకు అతీతంగా దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రజలు ప్రశాంత వాతావరణంలో హోలీ పండుగ జరుపుకోవడం సంతోషకరమన్నారు. మానవతా విలువలను కాపాడుకునే విధంగా ఒకరినొకరు గౌరవించుకునే విధంగా స్నేహపూర్వక వాతావరణంలో హోలీ పండుగ జరుపుకోవాలని సూచించారు. జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్ మాట్లాడుతూ ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తు చేశారు. హోలీ వేడుకల్లో తాము ప్రకృతి కలుషితం కాకుండా ఉండేలా రసాయనాలు కాకుండా సహజసిద్ధమైన రంగులను చల్లుకొని పండగ వేడుకలను నిర్వహించుకున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని హోలీ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ హోలీ వేడుకల్లో ఆత్మకూరు టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తూడి నరసింహారావు, నిమ్మికల్ దండు మైసమ్మ గుడి మాజీ చైర్మన్ బెల్లంకొండ యాదగిరి టిఆర్ఎస్ జిల్లా నాయకులు బొమ్మగాని శ్రీనివాస్ గౌడ్, చౌగోని సంతోష్ గౌడ్,కొల్లూరు బాలకృష్ణ, హరీష్, అమరవాది శ్రావణ్, సాయి తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333