చిన్నారులను అంగవైకల్యం నుంచి కాపాడుకుందాం

Dec 20, 2025 - 18:35
 0  0
చిన్నారులను అంగవైకల్యం నుంచి కాపాడుకుందాం

అడ్డగూడూరు 20 డిసెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– ఐదు సంవత్సరాల లోపు చిన్న పిల్లలందరికి ఈనెల 21వ తారీకున ఆదివారం పోలియో చుక్కలను తప్పనిసరిగా వేయించి వాళ్లను శాశ్వత అంగవైకల్యం నుంచి కాపాడుకుందాం.. డిసెంబర్ 21వ తేదీన పోలియో దినం సందర్భంగా అప్పుడే పుట్టిన బిడ్డనుండి ఐదు సంవత్సరముల లోపు చిన్నారులకు బూత్ స్థాయిలో పోలియో చుక్కలు వేస్తారు.ఆరోజు పలు కారణాల వల్ల పోలియో చుక్కలు వేసుకోలేకపోయినా పిల్లలకు తిరిగి ఈనెల 22,23వ తేదీల్లో ఇంటింటికి వెళ్లి పోలియో బృందాలు పోలియో చుక్కలు వేసింది లేనిది పరిశీలిస్తారు.భారతదేశం పోలియో రహిత దేశం అయినప్పటికీ మళ్లీ పోలియో రాకుండా ఉండేందుకు తగు ముందు జాగ్రత్తల్ని తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగు సూచనలను నిర్వహిస్తుంది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333