ఘనంగా మహాత్మా బసవేశ్వరుడి జయంతి వేడుకలు

తిరుమలగిరి 01 మే 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
మహనీ యుడు, మహాత్మా బసవేశ్వరుడి 890 జయంతి వేడుకలు తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రం లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుంకరి ప్రసాద్ మరియు స్వాతి వినయ్ లు బోర్కడే బసవేశ్వరుని చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ సమసమాజ స్థాపనకు మహాత్మా బసవేశ్వరుడు ఎంతో కృషి చేశాడన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలన్నారు. కార్యక్రమంలో రాజేందర్ కోటి లింగం కోటయ్య సోమన్న సోమరాజు నాగరాజు కిరణ్ రవి తదితరులు పాల్గొన్నారు.