ఘనంగా తెలంగాణ స్వతంత్ర సమరయోధుడు కాసం కృష్ణమూర్తి వర్ధంతి
తిరుమలగిరి 02 ఆగస్టు 2024 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో సామాజిక తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ కొత్తగట్టు మల్లయ్య ఆధ్వర్యంలో కాసం కృష్ణమూర్తి 18వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.అనంతరం పలువురు మాట్లాడుతూ కామ్రేడ్ కాసం కృష్ణమూర్తి అలియాస్ నిర్మల కృష్ణమూర్తి సాయుధ తెలంగాణ రైతంగ పోరాటంలో నైజాం రజాకార్లకు వ్యతిరేకంగా వీరోచితమైన పోరాటాలు నిర్వహించిన చరిత్ర కృష్ణమూర్తికి ఉన్నదన్నారు.అంతేకాదు ఆనాడు రాష్ట్రపతి అవార్డు గ్రహీత కృష్ణమూర్తి పొందడం చాలా గర్వకారణం.మోత్కూరు గడ్డం హామీను గడగడలాడించిన చరిత్ర నిర్మాల కృష్ణమూర్తి దక్కిందన్నారు. రజాకార్లతో వీరోచితంగా పోరాడిన తొలితరం తెలంగాణ ఉద్యమకారుల చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చి ఈతరం విద్యార్థులకు అందించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. ఆనాడు భీంరెడ్డి నరసింహారెడ్డి,మల్లు స్వరాజ్యం,చాకలి ఐలమ్మ కడవెట్టి తెలంగాణ తొలి అమరుడు కామ్రేడ్ దొడ్డి కొమురయ్యతో స్వరాజ్యం కోసం కొట్లాడిన వీరుడు కాసం కృష్ణమూర్తిని గుర్తు చేశారు.ఈ ప్రాంత ప్రజల రజాకార్ల నుండి విముక్తి చేయడం కోసం అనేక ఉద్యమాలు నిర్వహించారన్నారు.ఈ కార్యక్రమంలో జిఎంపిఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కడెం లింగయ్య,పట్టాపురం యాదగిరి,మొలకపురి పుల్లయ్య,నలుగురి రమేష్,జేరిపోతుల యాదగిరి,పోరెల్ల లక్ష్మయ్య,కొండ స్వామి తదితరులు పాల్గొన్నారు.