ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సంబరాలు
తిరుమలగిరి 02 ఆగస్టు 2024 తెలంగాణ వార్త రిపోర్టర్
సుప్రీంకోర్టు రిజర్వేషన్లలో వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి అధికారం ఉంటుందని ఇచ్చిన తీర్పుకు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా వద్ద భారీ ఎత్తున సంబరాలు జరుపుకున్నారు.ఎంఆర్పిఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కందుకూరి సోమన్న ఆధ్వర్యంలో డప్పు సప్పులతో ఊరేగింపు నిర్వహించి మహాత్మా జ్యోతిరావు పూలే,రాజ్యాంగ నిర్మాత బి ఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం గత 30 సంవత్సరాలుగా చేస్తున్న పోరాట ఫలితంగానే మందకృష్ణ నాయకత్వంలో నేడు తాము ఫలితాలను అనుభవించబోతున్నామని అన్నారు. ఈ ఉద్యమంలో ఎన్నో ఏళ్లుగా ఎందరో మాదిగ బిడ్డలు పాల్గొనగా కొందరు అమరులైనారని వీరందరూ త్యాగ ఫలితమే నేడు సుప్రీంకోర్టు తమకు అనుకూలంగా తీర్పునిచ్చిందని ఆయన అన్నారు.ఎస్సీ వర్గీకరణ సాధనలో జరిగిన ఉద్యమంలో తాము ఎన్నో కేసుల పాలైనామని, ఏనాడు వెనుకడుగు వేయకుండా మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు ఉద్యమాల్లో పాల్గొన్నమని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో మాదిగ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు చల్లగుండ్ల సోమయ్య ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు కందుకూరి శ్రీను కందుకూరు లక్ష్మయ్య ,పేరాల వీరేష్,కందుకూరి అంబేద్కర్,కందుకూరి బాబు,పత్తెపురం యాదగిరి,సామాజిక ఉద్యమ నాయకులు కొత్తగట్టు మల్లయ్య,కడెం లింగయ్య,తన్నీరు రాంప్రభూ నలుగురి రమేష్ తదితరులు పాల్గొన్నారు.