ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Jun 2, 2026 - 19:40
 0  2
ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

 జోగులాంబ గద్వాల 2జూన్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : _ఎర్రవల్లి. మండల కేంద్రంలోని శ్రీ సరస్వతి ఇంటర్నేషనల్ (సీబీఎస్ఈ) పాఠశాల నందు నేడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ను ఆవిష్కరించిన_ 
-పాఠశాల కరస్పాండెంట్ శ్రీమతి మధులిక గోవర్ధన్ రెడ్డి._

    ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడిన పాఠశాల కరస్పాండెంట్ శ్రీమతి మధులిక గోవర్ధన్ రెడ్డి తెలంగాణ ప్రజలు ఎన్నో పోరాటాల తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని స్వరాష్ట్ర సాధనకోసం 1969 నుండి పోరాటాన్ని ప్రారంభిస్తే 2014లో ఆ కల నెరవేరిందని అంటే నాలుగు దశాబ్దాలకుపైగా పోరాట పలితమే ఇప్పుడున్న మన తెలంగాణ రాష్ట్రం అని అన్నారు.

   తెలంగాణ సాధనకోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయని.. ఈ పోరాటంలో ఎందరో ప్రాణత్యాగాలు చేసారని ఎన్నో రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయని ఇలా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటువెనక చాలా స్టోరీ దాగివుందని ఆయన అన్నారు.

   ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ శ్రీ వీర గోవర్ధన్ రెడ్డి, డైరెక్టర్ శ్రీ వీర శ్రీనివాస్ రెడ్డి, కరస్పాండెంట్ శ్రీమతి మధులిక రెడ్డి, నవీన్, చిన్న లాలు, నరేంద్ర, నాగరాజు, మాధవి, సుమయ మరియు అధ్యాపక బృందం పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333