ఘనంగా చలసాని శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు
బారి కేక్ కట్ చేసి, సంబరాలు జరుపుకున్న జర్నలిస్టు లు
సూర్యాపేట 10 జూన్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి :- టియుడబ్ల్యూ జె ఐజెయు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సూర్యాపేట జిల్లా అక్రిడేషన్ కమిటీ మెంబర్ చలసాని శ్రీనివాసరావు జన్మదిన వేడుకలను సూర్యాపేట పట్టణంలోని ఆర్కే టవర్స్ వద్ద ఘనంగా నిర్వహించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారీ కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. చలసాని శ్రీనివాసరావును మీడియా ప్రతినిధులు శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా చలసాని శ్రీనివాసరావు మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా లో టియుడబ్ల్యు జె ఐజెయు అతిపెద్ద యూనియన్ అని, జర్నలిస్టు ల సమస్యల పరిష్కారానికి పోరాడే అసలైన యూనియన్ అని అన్నారు. జిల్లా లో యూనియన్ సభ్యత్వ నమోదు కార్యక్రమం చాలా వేగంగా జరుగుతుందని, కొత్తగా పెద్ద సంఖ్యలో సభ్యులు జాయిన్ అవుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యు జె ఐజెయు జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ బంటు కృష్ణ, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష కార్యదర్శులు బత్తుల మల్లికార్జున్, రెబ్బ విజయ్, ఎలక్ట్రానిక్ ప్రతినిధులు రశీద్, బిగ్ టివి రామకృష్ణ, హెచ్ఎంటీవీ నాగరాజు, లింగాల సాయి, సురేందర్, మధు, జహీర్, ప్రింట్ మీడియా ప్రతినిధులు కందుల నాగరాజు, శిగ సురేష్ గౌడ్,మెట్రో నర్సయ్య, సుంకర బోయిన వెంకటయ్య, తండు నాగేందర్, వల్లపట్ల రవి, కొండ్లె కృష్ణయ్య, తండు వెంకన్న, కందుకూరి యాదగిరి, మామిడి శంకర్, దుస్సా చంద్రశేఖర్ , దుర్గం బాలు, రామచంద్ర రాజు, పోలోజు సందీప్, మధు తదితరులు పాల్గొన్నారు.