ఘనంగా కార్ల్ మార్క్స్ జయంతి

ప్రపంచ మానవులందరూ విద్వేష తార తమ్య భేదాలు లేకుండా సమానంగా ఉండాలనే మార్క్స్ ఆలోచన చాలా గొప్పది .
-
సీపీఐ జిల్లా కార్యదర్శి బి ఆంజనేయులు.
ఎల్లలు లేని కమ్యునిజం అజరమరమైనది.
జోగులాంబ గద్వాల 5 మే 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి. కార్ల్ మార్క్స్ 207 వ జయంతి సందర్భంగా సోమవారం నాడు గద్వాలలోని CPI పార్టీ జిల్లా కార్యాలయం లో ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.ఈ సందర్భంగా CPI జిల్లా కార్యదర్శి బి. ఆంజనేయులు tpf రాష్ట్ర కో కన్వీనర్ ప్రభాకర్ మాట్లాడుతూ కారల్ మార్క్స్ జర్మన్ శాస్త్రవేత్త, తత్వవేత్త, ఆర్థిక వేత్త మరియు సోషలిస్టు విప్లవకారుడు అని, ఈయన మే 5, 1818 సంవత్సరంలో ట్రయల్ లోని చిన్న కుటుంబంలో జన్మించాడని,ఆ తర్వాత రాజకీయ తత్వశాస్త్రం చదువుకున్నాడని.యుక్త వయసులో మార్క్స్ ఏ దేశపు పౌరసత్వం లేని సమయంలో లండన్ లో జీవితం గడిపాడు. అలాగే లండన్ లోని మరో జర్మన్ తత్వవేత్త అయిన ఫ్రెడరిక్ ఎంగెల్స్ తో కలిసి అనేక పుస్తకాలు ప్రచుడించాడని,అందులో కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ముఖ్యమైనదని అన్నారు.ప్రపంచ లో సమాజంలో ఈయన సిద్ధాంతాలను మార్క్సిజం గా పిలుస్తారని,మార్క్సిజం ప్రధానంగా వర్గ పోరాటాల ద్వారా అభివృధి చెందిందని,పెట్టుబడిదారి వ్యవస్థ లో ఇది పాలక వర్గానికి,శ్రామిక వర్గానికి మధ్య ఘర్షణగా పరిణమిస్తుందన్నాడు.ఈ పెట్టుబడిదారి వ్యవస్థ లో బూర్జువాల చేతిలో సామాన్య ప్రజలు శ్రమ దోపిడీకి గురవుతారని,అందువలన పెట్టుబడిదారి వ్యవస్థ నాశన కావాలని కార్ల్ మార్క్స్ దాస్ క్యాపిటల్ అనే గ్రంథం రచించాడని అన్నాడు. అలాగే సమాజంలోని మనుషులందరికి సమాన హక్కులు కావాలని, మనుషులంతా ఒకటేనని కారల్ మార్క్స్ ని వారు కొనియాడారు. పెట్టుబడిదారీ వ్యవస్థ నాశనం కావాలని ఈయన చేసిన కృషి ఫలితంగా సామాన్య ప్రజలు వారి యొక్క శ్రమ దోపిడికి గురి కాకుండా అనేక వర్గ పోరాటాల ఫలితంగా పెట్టుబడిదారు వ్యవస్థను నాశనం చేశారు. కార్ల్ మార్క్స్ సిద్ధాంతాలు, ఆశయాల అనుగుణంగా శ్రమ జీవులు,పెదాలు, అట్టడుగు వర్గాల మంతా కృషి చేయాలని పేర్కొన్నారు నేడు అసమానతలు దోపిడీలు పెచ్చు మిరిపోయాయని కారల్ మార్క్స్ సిద్ధాంతంతో వాటిని ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు .కారల్ మార్క్స్ మార్చి 14, 1883 సంవత్సరంలో మరణించడం జరిగింది. అయినా ప్రపంచలో మానవాళి మనుగడకు కమ్యుంజమే ప్రత్యామ్నాయం అని తెలిపారు.ఈ కార్యక్రమంలోaiyf జిల్లా కార్యదర్శి కృష్ణ,aisf జిల్లా కార్యదర్శి ప్రవీణ్, టీజీ రాజు,గ్ ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శినారాయణ, కార్మిక నాయకుడు వెంకట్రామిరెడ్డి , మస్తాన్, హమాలీ సంఘం నాయకుడు శ్యాలి మియా,దీక్షిత్ తదితర నాయకులు పాల్గొనడం జరిగింది .