ఘనంగా కామ్రేడ్ భగత్ సింగ్ 94వ వర్ధంతి

Mar 23, 2025 - 20:08
Mar 23, 2025 - 20:40
 0  21
ఘనంగా కామ్రేడ్ భగత్ సింగ్ 94వ వర్ధంతి

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ ఘనంగా కామ్రేడ్ భగత్ సింగ్ 94వ వర్ధంతి ఆత్మకూర్ యస్:- దేశ స్వతంత్రం కోసం నవ్వుతూ ఉరికంబాలెక్కిన యువకిశోరాలు భగత్ సింగ్ రాజగురు సుఖదేవుల 94 వర్ధంతిని ఏపూర్ DYFI కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగినది.భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేశారు ఈ సందర్భంగా DYFI రాష్ట్ర కమిటీ సభ్యులు సానబోయిన ఉపేందర్, డివైఎఫ్ఐ మాజీ నాయకులు అవిరె అప్పయ్య గారలు మాట్లాడుతూ మా దేహం మొక్కలైన భరిస్తాం కానీ ఈ దేశాన్ని ముక్కలు కానివ్వం అంటూ నినదించిన గొప్ప స్వతంత్ర పోరాట యోధులు కామ్రేడ్ భగత్ సింగ్ అన్నారు ఈ దేశంలో దోపిడి శక్తుల పెత్తనం ఏ రూపంలో ఉన్న ఈ దేశ స్వతంత్రం సంపూర్ణం అయినది కాదు అన్నారు భగత్ సింగ్ చిన్నతనం నుండి దేశభక్తి కలిగి ఉన్నాడని అతని త్యాగం బ్రిటిష్ పాలన నుండి విముక్తి మాత్రమే కోరుకోలేదు అతను సామాజిక విప్లవాన్ని కోరుకున్నాడని ఇంకిలాబ్ జిందాబాద్ నినాదం ద్వారా సమాజంలో ఉన్న అన్ని రకాల అన్యాయాలను తుడిచి పెట్టాలని కోరుకున్నాడని అన్నారు సామాజిక సమానత్వం రాజకీయ నైతికత ప్రజల హక్కుల రక్షణ రక్షించే సంపూర్ణ స్వాతంత్రం కావాలని కోరుకున్నాడని పేద మధ్యతరగతులు తేడాలు లేకుండా కులం మతం ప్రాంతం బేధం లేని సమాజం కోసం ఆయన ప్రాణతాగం చేశాడని ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేసినప్పుడు మాత్రమే ఆయన ఘనమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతామని అన్నారు . భగత్ సింగ్ ఆశయాలైన మతోన్మాదానికి కులాలకు వ్యతిరేకంగా సమసమాజ స్థాపన కోసం సమాజంలో జరుగు అన్యాయాలపై. భగత్ సింగ్ స్ఫూర్తితో ఆందోళన పోరాటాలు నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు నూకలగిరి ప్రసాద్ రెడ్డి ఎరుకల నాగరాజు నవీల రవి అవిరె కరుణాకర్ ఎరుకల సైదులు జానీమియా మల్లయ్య వీరమల్లు తదితరులు పాల్గొన్నారు.