గ్రామసభలతోటే గ్రామాలు అభివృద్ధి ఏఈ మస్తాన్
10-06-2026 తెలంగాణ వార్త రిపోర్టర్ చిన్నంబావి మండలం.
చిన్నంబావి మండల పరిధిలోని గూడెం గ్రామంలో ఈరోజు గ్రామసభను నిర్వహించారు. గ్రామ ప్రగతి అభివృద్ధిపై చర్చించుకోవడానికి ప్రత్యేక గ్రామసభ దోహదపడతాయని ప్రజల భాగ్యసామ్యంతో గ్రామ అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించవచ్చని ఏఈ మస్తాన్ మరియు సర్పంచ్ కొత్త వెంకటరెడ్డి పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఏఈ మస్తాన్, మరియు సర్పంచ్ కొత్త వెంకటరెడ్డి, పంచాయతీ సెక్రెటరీ విక్రమ్ యాదవ్, గ్రామ వార్డ్ మెంబర్స్ అందరూ ముందుగా మొక్కలు నాటి గ్రామసభను ప్రారంభించారు.
మస్తాన్ మరియు కొత్త వెంకటరెడ్డి మాట్లాడుతూ వర్షాకాలం పంట మార్పిడి వ్యవసాయ ఉద్యానవన శాఖ ల కార్యాచరణ ప్రణాళిక, బడిబాట కార్యక్రమాలు, ఘన వ్యర్థాల నిర్వహణ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ విపత్తుల నిర్వహణ పారిశుధ్యం మొక్కల పెంపకం జల సంరక్షణ అంశాలపై గ్రామ ప్రజలతో సుదీర్ఘంగా చర్చించి అవగాహన కల్పించారు.
వర్షాకాలానికి ముందే గ్రామంలోని డ్రైనేజీలో శుభ్రం చేయడం గ్రామపంచాయతీ బాధ్యతను తెలిపారు. డ్రైనేజీల్లో ప్లాస్టిక్ బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేయవద్దని కోరారు ఘన వ్యర్థాల నిర్వహణ 2026 పై ప్రజలకు కచ్చితంగా అవగాహన కలిగి ఉండాలని కోరారు. తాగునీటి సరఫరాకు సంబంధించి క్రమం తప్పకుండా నీటి ట్యాంకులను బ్లీచింగ్తో సిబ్బంది శుభ్రం చేయాలని ఆదేశించారు సీజనల్ వ్యాధులు రాకుండా స్వచ్ఛమైన నీటి సరఫరా అందించే బాధ్యత అధికారులపై ఉంటుందని నేటి సరఫరా నిర్వహణ సక్రమంగా లేకపోతే ప్రజలు అధికారులకు సమాచారం అందించాలని?
ఈ యొక్క కార్యక్రమంలో సర్పంచ్ కొత్త వెంకటరెడ్డి తో పాటు ఏఈ మస్తాన్, పంచాయతీ సెక్రెటరీ విక్రమ్ యాదవ్, గ్రామ వార్డు నెంబర్స్, అంగన్వాడీ టీచర్స్ ఆశా వర్కర్స్ గ్రామ పెద్దలు యువకులు అధిక సంఖ్యలో గ్రామసభలో పాల్గొనడం జరిగింది.