గ్రామసభను విజయవంతం చేసిన అధికారులు

Jun 4, 2026 - 20:12
Jun 5, 2026 - 19:09
 0  1
గ్రామసభను విజయవంతం చేసిన అధికారులు

04-06-2026 తెలంగాణ వార్త రిపోర్టర్ చిన్నంబావి మండలం : చిన్నంబావి మండల పరిసర ప్రాంతమైన గడ్డ బసాపూర్‌లో గ్రామసభ.. పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక చర్యలు!

చిన్నంబావి మండల పరిధిలోని గడ్డ బసాపూర్ గ్రామంలో గురువారం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సెక్రటరీ, ఏపీఓ ధనుంజయరాజు, గ్రామ సర్పంచ్‌తో పాటు గ్రామస్థులు హాజరయ్యారు.ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న వివిధ సమస్యలను గ్రామ పెద్దలు, ప్రజలు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. అధికారులు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. గ్రామ వీధుల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి పరిశుభ్రతను కాపాడాలని సూచించారు.అలాగే భూగర్భ జలాల సంరక్షణ కోసం ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని గ్రామస్తులకు అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీల్లో మొక్కల పెంపకాన్ని ప్రోత్సహిస్తూ, జూలై నెలలో చేపట్టనున్న మొక్కల పంపిణీ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ప్రభుత్వ స్థలాలు, ఖాళీ ప్రదేశాల్లో విస్తృతంగా మొక్కలు నాటాలని సూచించారు.వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామంలోని పాత, శిథిలావస్థకు చేరిన మిద్దెలను గుర్తించి ప్రజల భద్రత కోసం సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టాలని అధికారులు సూచించారు."పరిశుభ్రమైన గ్రామం – పచ్చని గ్రామం" లక్ష్యంగా ప్రతి గ్రామస్తుడు సహకరించాలని అధికారులు పిలుపునిచ్చారు.కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సాయికుమార్, సర్పంచ్ మల్దకల్, ఉపసర్పంచ్, నాగపూర్ బీసన్న, వార్డు సభ్యుడు రాముడు, మాజీ సర్పంచ్ రాణమ్మ, ఉపాధ్యాయుడు వెంకటేష్, అంగన్‌వాడీ టీచర్ వేనమ్మ, ఆయా పుష్ప, సీనియర్ మేటి శ్యామ్సన్ తదితరులు పాల్గొన్నారు.

Vishnu Sagar Chinnamabavi Mandal Reporter Wanaparthi District Telangana State