గ్రామపంచాయతీ కార్మికులకు 26వేల జీతం కల్పించాలి
సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు బుర్రు అనిల్ కుమార్
అడ్డగూడూరు 25 జూలై 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని స్థానిక గ్రామ పంచాయితీ ఆఫీసులో గ్రామ పంచాయితీ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు బుర్రు అనిల్ కుమార్ మాట్లాడుతూ..కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను బానిసలుగా వాడుకుంటూ కార్మికుల కష్టాల్ని విస్మరించి కార్మికులకు ఇవ్వాల్సినటువంటి వేతనాలను పూర్తిగా కుదించి కార్మికుల హక్కులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పే విధంగా ఈనెల 29న అడ్డగూడూరులో సీటు జనరల్ పార్టీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామపంచాయతీ సిబ్బందికి మల్టీపర్పస్ విధానం తీసుకొచ్చి గ్రామపంచాయతీ సిబ్బందిని తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తూ వాళ్ళ కష్టానికి తగిన గుర్తింపు ఇవ్వకుండా కార్మికులకు కనీస వేతనం 26వేల రూపాయలు ఇవ్వాలని సిఐటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ యూనియన్ రంగా కార్మికులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఉచితం తీసుకొచ్చి ఆటోలు కార్మికులు పూట గడవని పరిస్థితి కనపడుతుంది.దీని ప్రభావం లక్షలాది మంది కుటుంబాలు పైన భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.తక్షణమే కార్మికులకు ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని సిఐటియుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో రాం చరణ్,సోమయ్య,పద్మ తదితరులు పాల్గొన్నారు.