గుంతలతో గట్టు రహదారి దారుణం… ప్రయాణికులకు నరకయాతన

Apr 14, 2026 - 20:13
 0  2

ప్రధాన రహదారి పాడైపోయింది… అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం.

 జోగులాంబ గద్వాల 14 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి :  గట్టు మాచర్ల గ్రామం నుంచి గట్టు మండల కేంద్రానికి వెళ్లే ప్రధాన రహదారి గుంతలతో అధ్వానంగా మారింది. పలు గ్రామాల నుంచి రోజూ వందల వాహనాలు ఈ దారిలో ప్రయాణిస్తుండగా.. గుంతల కారణంగా ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 


ఈ సమస్యపై స్పందించిన మాచర్ల 7వ వార్డు సభ్యుడు భీమేష్ నాయుడు, వెంటనే రహదారి మరమ్మతులు చేపట్టాలని అధికారులను డిమాండ్ చేశారు. ముఖ్యంగా ప్రమాదాలను నివారించేందుకు మలుపుల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333