గద్వాలలో ఆర్టీసీ బస్సులు మళ్లీ ప్రారంభం
సివిల్ డ్రస్సుల్లో కండక్టర్ల సేవలు.. ప్రయాణికులకు ఊరట
జోగులాంబ గద్వాల 22 ఏప్రిల్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- గద్వాల. జిల్లాలో RTC సమ్మె అనంతరం బస్సులు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కండక్టర్లు ప్రయాణికుల సౌకర్యం కోసం సివిల్ డ్రస్సులు ధరించి సేవలందించారు. సమ్మె కారణంగా ఇబ్బందులు పడిన ప్రయాణికులకు వీరి సేవలు కొంత ఊరటనిచ్చాయి. బస్సు సర్వీసులు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటుండగా, ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, సిబ్బంది కలిసి రవాణా వ్యవస్థను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.